జగన్ హయాంలో మద్యం కుంభకోణం కొండవీటి చాంతాడులా సాగిపోతూనే ఉంది. ఈ కుంభకోణంలో ఒకదానికొకటి లింకులు కలుపుకుంటూ చివరకు అసలు డబ్బు ఎక్కడికే చేరిందో సిఐడి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది . తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేషీలో కీలక అధికారులుగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ,మరో అధికారి ముఖ్యమంత్రి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి..వీరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ తర్వాత వీరిద్దరిని మళ్లీ సిఐడి కి విచారణకు కస్టడీకి కోరనున్నారు
ఇప్పటి వరకు సిఐడి లాగిన కూపీ ప్రకారం గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి సాక్షిలో డైరెక్టర్ గా ఉంటూ ప్రస్తుతం అరెస్టయి జైల్లో ఉన్నాడు. ఈయన ద్వారానే మద్యం ముడుపుల్లో ఎక్కువభాగం రూటింగ్ అయింది. బెంగళూరులో జగన్ ప్యాలస్ కేంద్రంగా ఈయన ఉండేవాడు. అక్కడనుంచే మద్యం ముడుపుల లెక్కలు చూసేవాడు. ఇతడి ద్వారా బినామీ కంపెనీలతో 1000 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని తేలింది.
గోవిందప్ప బాలాజీ కూడా తన వాంగ్మూలంలో తనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎక్కడికి ఎలా చేర్చారో వివరంగా చెప్పేశారని తెలిసింది. ఆ తర్వాత ఈ డబ్బులు తీసుకున్న బెంగళూరులోని జగన్ ప్యాలెస్ లో ఒకరిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నంలో సిఐడి ఉంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయం మరో వారం రోజుల లోపల తేలిపోగలదు. ముంబైలోని పలు బంగారు దుకాణాలను కూడా ఈమధ్యం కేసులో నిందితులుగా చేర్చారు . ఈ బంగారు దుకాణాలనుంచి 400 కోట్ల రూపాయలు బంగారం కొన్నట్టు తేలింది. ఇప్పుడు ఆ బంగార దుకాణం యజమానులు కూడా తమ దగ్గర ఎవరు కొన్నారు ,ఎలా కొన్నారు అన్న వివరాలు కూడా చెప్పేసారు. ఆ బంగారం ఎక్కడుందో తేల్చే పనిలో ఈడీ , సిట్ ఉన్నాయి.
మద్యం కుంభకోణంలో మేజర్ భాగస్వామి కర్నూలుకు చెందిన ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ కి సంబంధించిన శ్రీధర్ రెడ్డి పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన ద్వారా కూడా దాదాపు 18 వందల కోట్ల రూపాయల ముడుపులు డొల్ల కంపెనీలకు చేరి అవి అక్కడ నుంచి ఎక్కడికి చేరాయో అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది . సజ్జలను పోలీసులు విచారించే కొద్దీ అతడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారని తెలిసింది .
గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం తర్వాత మొదలైన ఈ డొల్ల కంపెనీలు ఏ వ్యాపారం చేయకుండానే వాటిల్లోకి నిధులు ఎలా వచ్చాయి అన్నది మాత్రం ఆ కంపెనీలు పెట్టిన వారిని కూడా సరైన సమాధానం లేదు. ఇదిలా ఉండగా తాజాగా రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు సిద్ధం చేసుకుంది . ఏసీబీ కోర్టు కూడా ఎందుకు అనుమతించింది . మొత్తానికి మద్యం కుంభకోణంలో అసలు బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్, సీఐడీ, ఈడీ , పోలీస్ నాలుగు విభాగాలు పనిమొదలుపెట్టాయి..

