హైదరాబాద్ సరూర్ నగర్ లో ఆలయ పూజారి వెంకటకృష్ణకు కోర్టు జీవిత ఖైదు విధించింది. తానూ పూజారిగా ఉండే గుడికి వచ్చే అప్సర అనే యువతిని ప్రేమ పేరుతొ వంచించాడు. పెళ్ళైన వెంకటకృష్ణ తనకు పెళ్లి కాలేదని నమ్మించాడు. ఐదేళ్లపాటు సన్నిహితంగా ఉన్నాడు. అప్సర పెళ్లి చేసుకోమని కోరడంతో ఆమెను వదిలించుకోవాలని పధకం వేసాడు. కోయంబత్తూరుకు విహార యాత్రకు పోదామని నమ్మించాడు.
విమానానికి టికెట్లు కూడా బుక్ చేసానని ఫేక్ టికెట్లు చూపించాడు. ఆమెను ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్లే నెపంతో , కారులో శంషాబాద్ వైపు తీసుకెళ్లి , అక్కడ చంపేసి , ఒక డ్రైనేజి మ్యాన్ హోల్ లో కుక్కేసాడు. దానిలో సిమెంట్ వేసి నీళ్లు పోసి , ఇక నేరం బయటకు రాకూడదని పధకం వేసాడు. అయితే అప్సర తల్లితండ్రులు చేసిన , ఫిర్యాదు, అదృశ్యమైన రోజు ఇద్దరూ కారులో పోతున్న సిసి కెమెరా దృశ్యాలతో చిక్కిపోయి , నేరం ఒప్పుకున్నాడు., దీంతో కోర్టు ఆయనకు జీవితశిక్ష విధించింది..

