రోజురోజుకీ మారుతున్న ఆధునిక విజ్ఞానం సంచలనమైన మార్పులు తీసుకొస్తోంది . నేటి తరానికి అవి కళ్ళ ముందే కదులుతున్నట్టు ఉంటాయి. నిన్నటి తరానికి అవి అద్భుతాలుగా కనిపిస్థాయి. దేశంలో సరుకులు రవాణా రంగం తీవ్రమైన వేగంతో ముందుకుపోతొంది. 30 ఏళ్ళ నాటికంటే వెయ్యి శాతం పెరుగుదల ఉంది. రోడ్డు ,రైలు, విమానం, నౌకాయానం ఇలా వివిధ మార్గాల ద్వారా సరుకుల రవాణా నానాటికి పెరిగిపోతుంది. వీటి ఆదాయ వనరులలో ప్రధానంగా సరుకుల రవాణా ద్వారానే వస్తోంది. రైల్వేలో ఇప్పటికే గూడ్స్ రైళ్ల రాకపోకల కోసం డెడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు . అంటే ఆ రైలు పట్టాల మీద దాదాపుగా గూడ్స్ రైళ్లు మాత్రమే పోతాయి. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప ప్యాసింజర్ రైలును ఆ లైన్ లో అనుమతించరు .
రైలు రవాణారంగంలో తాజాగా అద్భుతమైన ప్రయోగం ఫలించింది. బులెట్ ట్రైన్ తరహాలో లీవియేషన్ గూడ్స్ రైలుని ఫిన్లాండ్ దేశం ప్రయోగాత్మకంగా విజయవంతం చేసింది. రైలు పట్టాలపైనా అంగులయెత్తులో గాలిలో పోయే ఈ లీవియేషన్ రైలు గంటకు 500 కిలోమీటర్ల వేగంతో పోతుంది. దీనివల్ల రవాణారంగం సరఫరాలో సమయం ఆదాఅవుతుంది.తద్వారా ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పట్టాల వ్యవస్థను కూడా ఫిన్లాండ్ ఏర్పాటు చేసింది. ఈ గూడ్స్ రైలు గంటకు 500 కిలోమీటర్ల వేగంతో పోగల ఈ ప్రయోగం విజవంతం కావడంతో మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగనున్నాయి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

