22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

బైక్‌ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు. బైక్‌ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్‌ లీక్‌ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఏమైందో అర్ధమయ్యేలోపే.. 19 మంది సజీవ దహనం అయ్యారు. కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్నటేకూరులో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఎన్నో ఆశలతో ప్రారంభమైన వారి ప్రయాణం.. గమ్యానికి చేరకమునుపే, ఇలా అకస్మాత్తుగా ముగిసిపోయింది.

ఆ బస్సుకు వెనుక ఇంజిన్ , అందుకే బైక్ ఢీకొని మంటలు

ప్రమాదం జరిగే సమయానికి ప్రయాణీకులు అందరూ గాఢ నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కువ మంది తప్పించుకుందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి కొందరు బయటపడగా.. అద్దాలు పగలగొట్టుకొని మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో.. పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. స్థానికులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే.. ప్రయాణీకులు మంటల్లో కాలిబూడిదయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన కొందరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.