22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

కొడాలి నానికి బైపాస్ కి సిఫారసు.

మాజీమంత్రి, వైసిపి నేత కొడాలి నానికి హృదయసంబంధ సమస్యలు ఉన్నట్టు డాక్టర్లు నిర్దారించారని చెబుతున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన చేరిన విషయం తెలిసిందే. గుండెకు సంబంధించి ఆయనకు నాళాల్లో సమస్య ఉందని, గుండెకు రక్తాన్ని చేరవేసే మూడు రక్త నాళాలు మూసుకుపోయాయని చెప్పారు. అందువల్ల బైపాస్ సర్జరీకి లేదా స్టెంట్స్ వేసుకునేందుకు సిఫార్సు చేసారని తెలుస్తోంది. హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అవుతున్నారు.

ఆపరేషన్ విషయం తరువాత నిర్ణయిస్తామని , ప్రస్తుతానికి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆలోచిస్తామని చెప్పారని తెలుస్తోంది. వైసిపి ఫైర్ బ్రాండ్స్ ఇలా ఒక్కొక్కరుగా ఏదో ఒక కారణంతో అస్వస్తులు కావడమో, జైళ్లకు పోవడమో, మరికొందరు అసలు రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రాల్లో తలదాచుకోవడమో చేస్తున్నారు. కొడాలి నాని కూడా గత కొంతకాలంగా తిట్లకు దాదాపు దూరంగానే ఉన్నారు. కొన్ని కేసులలో ఆయన అనుచరులు జైళ్లలో ఉన్నారు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.