ఖజూర్ … ఇది అసలు సిసలైన పురాతన కాలం నాటి మిఠాయి . రాజుల కాలం నుంచి జమీందారుల వరకు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదొక ప్రత్యేకమైన వంటకం. వంటకం అంటే ఏదో ఫ్యాషన్ గా చేసే మిఠాయి కాదు . బలవర్ధకమైన ఆహారంగా పుష్టిగా శరీరానికి పౌష్టికాహారాన్ని సరఫరా చేసి స్వీట్ ఇది. ఈ స్వీట్ చిన్నపిల్లల కైనా, పెద్దలకైనా మంచి బలవర్దకమైన స్వీట్ ఇది. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలిచే ఈ స్వీట్ ని దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో దీన్ని ఖజూర్ అంటారు . ఈ స్వీటు మూడు రకాల పిండితో తయారుచేస్తారు .
గోధుమపిండి,రాగి పిండి , సజ్జపిండి ..ఇవి ఎలాంటి బలవర్ధకమైన పౌష్టికాహారమో చెప్పనవసరంలేదు. మూడు రకాల పిండిని తీసుకొని సమపాళ్లలో మిశ్రమం చేసుకొని ఆ తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి పోసుకుని బాగా కలుపుతారు. ఆ తర్వాత చక్కెర లేదా బెల్లం నీళ్లలో మరిగించి సువాసన కోసం దాంట్లో యాలకులపొడి వేసి ఈ పిండిపై పోసి కలిపి ముద్ద చేస్తారు. ముద్ద చేసే వరకు నీళ్లు కలుపుకుంటూ ఉంటారు .
దానిని చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా తమకి ఇష్టమైన షేపులో కోసుకుంటారు. ఆ తర్వాత దీన్ని నూనెలో వేయించి పెట్టుకుంటారు సాధారణంగా పెద్దల వద్దకు పోయేటప్పుడు మర్యాదపూర్వకంగా ప్రేమగా ఈ స్వీట్ తీసుకెళ్తారు . ఇది ఉత్తర భారత దేశంలో పర్వదినాల్లో ఇంటికి వచ్చే ఆడపడుచులకు ప్రత్యేకంగా తయారు చేసి పెడతారు .
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

