బిఆర్ఎస్ నాయకురాలు, కేసీఆర్ కూతురు వేరు కుంపటికి సిద్ధమైపోయింది. పార్టీలో సోదరుడి పెత్తనం సహించలేక, భవిష్యత్తులో కేటీఆర్ నే భావి సీఎం గా పొగుడుతుండటంతో ఆమె వేరుకుంపటికి తీర్మానించుకుంది. అందుకే తెలివిగా తండ్రికి లేఖరాసి , కలకలం రేపింది. పార్టీకోసం, తాను జైల్లో ఉంటే , పెత్తనం తనకుకాక సోదరుడికి ఇవ్వాలన్న నిర్ణయంలో ఆమె అసంతృప్తి, అసహనం ఇప్పుడు లేఖ రూపంలో బట్టబయలు అయింది. తండ్రి కొంతమంది చేతుల్లో బందీ అని ఆరోపిస్తోంది. బిజెపితో లోపాయికారీ స్నేహంపై నేరుగానే నిలదీస్తోంది.
కొన్ని దఫాలు కాంగ్రెస్ తో మిలాఖత్ కూడా ఎందుకని అడుగుతొంది. ఇలాంటి ద్వంద వైఖరులతో పార్టీ ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారని ఆమె బాధపడుతొందని అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు షోకాజ్ నోటీసు జారీకి రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ గరం గరం గా ఉన్నారని ,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. .పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, లేదా సంజాయిషీ కోరుతారా అనేదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

