తమిళనాడు రాష్ట్రంలో కరూర్ పట్టణంలో సినీనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ సభలో తొక్కిసలాటపై రాజకీయ క్రీడ మొదలైంది. దీనిపై ప్రముత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జిచేత విచారణ జరిపిస్తామని , కమీషన్ కూడా వేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి , లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని విజయ్ కేంద్రానికి లేఖ రాసారు. బిజెపికూడా అదే స్వరం వినిపిస్తోంది. ఈ తొక్కిసలాట వెనుక రాజకీయ కుట్ర ఉందన్న గుసగుసలను వ్యాప్తి చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక పార్టీ అంటూ కమల్ హాసన్, రజని కాంత్ లాంటి అగ్రనటులు చేనిన హుంకారాలు, ఘింకారాలు ఉత్తుత్తువే నని తేలిపోయాయి. రజనీకాంత్ బీజేపీకి దాసోహం అయ్యారు. కమల్ డీఎంకే తో సర్దుకున్నారు. ఇద్దరూ రాజకీయంగా ఫ్లాప్ అయ్యారు.
ఇప్పుడు మళ్ళీ విజయ్ శకం మొదలైంది. విజయ్ ని కూటమిలోకి తీసుకురావాలని బీజేపీ పాచికలు వేస్తోంది. దానికి ఈ తొక్కిసలాటకు అవకాశంగా తీసుకుని, వాడుకోవాలని చూస్తోంది. అయితే విజయ్ ఇంతకుముందే తాను బిజెపికి, డీఎంకేకు , అన్నాడీఎంకేకు దూరమని చెప్పేసారు. కరూర్ దుర్ఘటనలో తన తప్పిదం లేదని చెప్పుకునేందుకు విజయ్ ఇప్పుడు రాజకీయాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే కుట్ర చేస్తోందంటున్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు. అన్నామలై విజయ్ కు మద్దతు ప్రకటించారు.
తొక్కిసలాటలో విజయ్ తప్పిదమేమీ లేదని అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపిణలు చేస్తున్నారు. నిజాలు బయటకు రావాలని కేసును సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్ కు ఊరటనిస్తుందా లేకపోతే సమస్యలు తెలుస్తుందా అన్న సంగతి పక్కన పెడితే.. విజయ్ పై బీజేపీ ట్రాప్ వేసిందని స్పష్టమవుతోంది. విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది.. ఇప్పటివరకు సినిఈ గ్లామర్ తో కొట్టుకొచ్చిన విజయ్ ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి. 36 మంది మృతుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం ఇవ్వడం ద్వారా , ప్రభుత్వంకంటే తానె రెండింతలు ఎక్క్కువ ఇచ్చానని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు డీఎంకే రాజకీయ అస్త్రాలనుంచి ఎలా తప్పించుకుని , ఈ సంక్షోభం నుంచి బయటపడతారో చూడాల్సిఉంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

