22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

జియో సైకిల్ దూసుకువచ్చేస్తుంది.

జియో కంపెనీ మార్కెట్లో మరో సంచలనం సృష్టించనుంది . ఎలక్ట్రిక్ సైకిల్ ను మార్కెట్లో త్వరలో ప్రవేశం పెట్టనుంది . ఈ సైకిల్ ధర అక్షరాల 29వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు . అంటే ఒక్క రూపాయి తక్కువ 30,000 రూపాయలు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ,ట్రాఫిక్ రద్దీ ఇలాంటి వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ సైకిల్ వినూత్నంగా రూపొందించామని జియో కంపెనీ చెబుతోంది . 250 నుంచి 350 వాట్స్ ఎలక్ట్రిక్ మోటార్ తో దీన్ని రూపొందించారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు రీఛార్జ్ అవసరం లేకుండానే ఈ సైకిల్ పోగలదు . దీంట్లో డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఉంది . ఆ తర్వాత టిఎఫ్టి డిస్ప్లే మరియు ముందు వెనక చక్రాలకు డిస్క్ బ్రేకులు ,సస్పెన్షన్ సిస్టం, ఇవన్నీ కూడా సురక్షితమైన రైడింగ్ కి ఉపయోగపడతాయని పేర్కొంది. జియో కంపెనీ ఎలక్ట్రిక్ సైకిల్ తో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా ప్రవేశిస్తుందని భావిస్తున్నారు . తమ ఉత్పత్తులు పర్యావరణ హితాన్ని కోరే ఉంటాయని జియో ప్రకటించింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.