జపాన్ దేశస్తులు క్రమశిక్షణకు, సమయాభావానికి మారుపేరు అంటారు. అక్కడ రైళ్లు ఒక సెకను లేట్ అయితే క్షమాపణలు చెప్పే ఆచారం ఉంది . సాధారణంగా ఏడాదిలో మూడు నాలుగు దఫాలు తప్ప 15 సెకండ్లు మించి రైళ్లు కూడా ఆలస్యమయ్యే సందర్భం లేదు. ఆఫీసులో కూడా సమయానికే ఉద్యోగులు హాజరవుతారు. ఆ సమయంలో వారి వాహనాలను పార్కింగ్ చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది . ఇలాంటి క్రమశిక్షణలో పెరిగిన జపాన్ దేశస్తులు టోల్ ప్లాజాలో ఒకవేళ ఎలక్ట్రానిక్ పరికరాలు ,నంబర్ ప్లేట్ రీడ్ చేసే కెమెరాలు పనిచేయకపోతే ఏమి చేస్తారో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఏడాదిలో ఇంతవరకు జపాన్లో 38 గంటలు టోల్ ప్లాజాలో కెమెరాలు ,పరికరాలు విఫలమయ్యాయి . వాహనాల నెంబర్ ప్లేట్లను రీడ్ చేయలేకపోయాయి.

అలాంటి పరిస్థితిలో 28 సెకండ్లకు మించితే వాహనాలను వదిలేస్తారు . డబ్బులు కట్టకుండా వెళ్ళిపోవచ్చు. అయితే ఇందులోనూ ఓ విచిత్రం ఉంది.టోల్ ప్లాజాలో డబ్బులు కట్టకుండా వెళ్లిపోవడం అంటే ఎవరికైనా సంతోషమే. మన దేశంలో అయితే అసలు ఆ సంతోషానికి అవధులే ఉండవు. అయితే టోల్ ప్లాజాలు విఫలమైన సందర్భాల్లో గేట్లు ఎత్తివేసి టోల్ ఫీజు కట్టకుండా పోయిన అనేక సంఘటనల్లో ఆ టోల్ ఫీజులు ప్రభుత్వానికి జమ కావడం విచిత్రం. సాధారణంగా అయితే ఇది మనం నమ్మలేము కానీ జపాన్లో అది సాధ్యం. దాదాపు 38 గంటల పాటు ఈ ఏడాదిలో ఇంతవరకు టోల్ ప్లాజాలో సెన్సార్లు విఫలమై డబ్బులు కట్టించుకోకుండా పంపించేశారు.

అయితే అలా వెళ్లి పోయిన వాళ్లలో 24 వేలమంది వెళ్లిపోయిన తర్వాత తమ డబ్బు ఆన్లైన్లో టోల్ ప్లాజాల అకౌంట్లోకి జమ చేసేసారు. ఇలా చేయకపోయినా అక్కడ అడిగే వారు లేరు . ఎందుకంటే నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట సమయం వరకు అక్కడ వాహనాలు ఆగుతాయి . ఆ తర్వాత ఆగే వాహనాలు డబ్బులు కట్టకుండా వెళ్ళిపోవచ్చు . అసలు కెమెరాలు పనిచేయని సందర్భంలో డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ జపాన్ దేశస్తులు 24 వేల మంది ఇలా ఆన్లైన్లో టోల్ ప్లాజాలకు తాముచెల్లించాల్సిన మొత్తాలను జమ చేసేసారు . జపాన్ దేశస్తులు తమ దేశంలో చట్టాలను ,నిబంధనలను ,నియమాలను గౌరవించే మనస్తత్వం ఎంత బలంగా ఉందో ఇదే ఉదాహరణ. అక్కడ సామాజిక భద్రత , నమ్మకం ,నైతిక విలువలు ,విశ్వాసం ,ప్రజలు రాజ్యాంగం గౌరవిస్తూ ప్రవర్తించే తీరుకు ఇది నిదర్శనం.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

