కొన్ని జబ్బులు విషయంలో శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధన కొనసాగుతూనే ఉంటాయి. నయం చేయడానికి వీలుకాని జబ్బులు, మందులు,వైద్య సదుపాయం లేని జబ్బుల విషయంలో కొంతమంది శాస్త్రవేత్తలు పట్టు వదలని విక్రమార్కుల్లా పరిశోధన చేస్తూనే ఉంటారు. వాటికి పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో మునిగితేలుతుంటారు . ఇలాంటివారు నిజంగా దైవ సమానులు .జన్యుపరమైన లోపాలతో పుట్టే పిల్లల విషయంలో డౌన్ సిండ్రోమ్ అని వ్యాధి భయంకరమైనది . మెదడు ఎదుగుదల ఆగిపోయి, అన్ని అవయవాలు సరిగా పని చేయక మెదడు ఎదగక ఇలాంటి తీవ్రమైన జన్యు సమస్యలు డౌన్ సిండ్రోమ్ వ్యాధిలో వస్తాయి .
ఈ డౌన్ సిండ్రోమ్ కు మందులు లేవు. అందువల్ల దాని కారణాలపై నిరంతరం చేసే పరిశోధనలు ఇప్పుడు జపాన్లోని మియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయోగాలు విజయవంతం చేశారు . ఇది డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులైన లక్షలాదిమందిపిల్లలకు ఒక ఆశా కిరణం . ఒక వర ప్రసాదం కాబోతోంది . దీనికి కారణమైన క్రోమోజోమ్ -21 కి మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చునని భావిస్తున్నారు. క్రోమోజోమ్ 21 లో లోపంవల్లనే ఈ డౌన్ సిండ్రోమ్ వ్యాధి వస్తుంది. ఈ క్రోమోజోమ్ 21 నుంచి లోపాన్ని విజయవంతంగా వేరు చేయడం అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న పరిష్కారం .
దీనివల్ల మెదడుకు సంబంధించిన జీన్స్ సక్రమంగా ఉండేట్టు చేసే పరిశోధనలో విజయం సాధించారు . ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ , భవిష్యత్తులో మానవాళికి ఉపకరించబోతోంది . డౌన్ సిండ్రోమ్ కలిగే లక్షణాలు నిరోధించగలిగే ఈ ప్రయోగంలో కొన్ని నైతిక అంశాలు , కొన్ని సామాజికపరమైన అడ్డంకులు ఇబ్బందులు కూడా ఉన్నాయి . అవి ఉన్నప్పటికీ భవిష్యత్తులో జన్యూపరమైన లోపాలకు ఆ లోపాలు సరిదిద్దేందుకు ఇది ఉపకరించబోతోంది. తల్లితండ్రులనుంచి వంశ పారంపర్యంగా వచ్చే 23 జతల క్రోమోజోమ్స్ లో 20 వేలనుంచి 25 వేల జీన్స్ ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్ రెండు కలిసి ఉంటాయి. అయితే 21 వనంబర్ క్రోమోజోమ్ లో మూడోది ఉంటే , ఈ డౌన్ సిండ్రోమ్ వస్తుందంటారు.

