స్మార్ట్ వాచెస్ అబ్బో సూపర్ అనుకుంటుండగానే స్మార్ట్ టాయిలెట్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు కుర్రాళ్ళు నుంచి పెద్దల వరకు స్మార్ట్ వాచెస్ పెట్టుకొంటున్నారు. ఇవి మొబైల్ సంధానం అయ్యి ఉంటాయి . ఈ స్మార్ట్ వాచ్ లో అనేక సౌకర్యాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి
.బిపి, హార్ట్ రేట్ సమాచారం, వాకింగ్ వివరాలు , శరీరంలో కొవ్వు శాతం, టెంపరేచర్ ఇలా అనేక రకాలైన వైద్య పరమైన అంశాలతో ఈ స్మార్ట్ రూపొందించారని చెప్తారు. కొన్ని స్మార్ట్ వాచెస్ ను, పేషెంట్ కి సంబంధించిన డాక్టర్ లేదా హాస్పిటల్ తో లింకింగ్ సౌకర్యం కూడా కల్పించుకోవచ్చు. అంటే ఆ వాచి కట్టుకున్న వ్యక్తి బాగోగులు ఆరోగ్యం ఇవన్నీ కూడా సంబంధిత డాక్టర్ వద్దన లేదా హాస్పిటల్ వద్దన రికార్డ్ అయి ఉంటాయి. వైద్య పరమైన అవసరం వచ్చినప్పుడు అక్కడే డాక్టర్ వాటిని చూసుకొని సలహాలు ఇవ్వచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంది . ఇది ఇప్పుడు క్రమంగా పాతబడిపోయింది కూడా.
తాజాగా జపాన్ లో స్మార్ట్ టాయిలెట్ తయారు చేశారు. ప్రతి రోజూ వాష్ రూంకి పోయినప్పుడు స్మార్ట్ టాయిలెట్ ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. ఉదయాన్నే టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మలమూత్రాలను అది పరీక్షించి, పరిశీలించి దానిలో లోపాలను గుర్తించి వెంటనే స్క్రీన్ మీద తెలియజేస్తుంది. యూరిన్ పరీక్షలు, మలపరీక్షలు ఇవన్నీ కూడా అది చేసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్ తో మొత్తం ఆరోగ్యపరమైన నివేదికను ఇస్తాయి ..
మలం ఆకారం, రంగు దానిలో ఉన్న బ్యాక్టీరియా లేదా చెడు పదార్థాల విశేషాలను, మూత్రంలో షుగర్ , ఆల్బమిన్, ఇలా అన్ని రకాల మూత్ర సంబంధం అయిన పరీక్షలు చేసి నివేదిక ఇచ్చేస్తుంది. ప్రయోగ దశలో ఇది విజయవంతం అయింది. మరో ఐదేళ్లలో వాడుకలో కూడా రానుంది . చూడండి టెక్నాలజీ ఎంత మారిపోయిందో..? ఇలాంటివన్నీ వాడుకలోకి వచ్చిన తర్వాత బహుశా మెడికల్ ల్యాబ్స్ తో పని తగ్గిపోవచ్చు. ఈ రిపోర్ట్స్ తో, ఏ మందులు వాడితే మంచిదో కూడా స్మార్ట్ టాయిలెట్ చెప్పేస్తుంది. సో డాక్టర్లతో కూడా భవిష్యత్తులో పెద్దగా పని లేకపోవచ్చు. ఇదీరాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం..

