ప్రపంచంలో ప్రకృతి, పరిసరాలే కాదు , కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా విచిత్రంగా ఉంటారు. నమ్మలేని లక్షణాలు వాళ్లలో ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఇలాంటి మనుషులు తారసపడుతుంటారు. అలాంటి మనిషే జమువిట రువాండాకు చెందిన జమువిట గత 55 ఏళ్లుగా మహిళంటే భయంతోనో, వారిని చూసేందుకు ఇష్టంలేకనో జీవిస్తున్నాడు. ప్రస్తుతానికి జమువిట వయసు 71 సంవత్సరాలు. మహిళలంటే విపరీతమైన భయంతో తనకు తానుగా ఏకాంతర వాస శిక్ష వేసుకొని దూరంగా ఉండిపోయాడు. దీన్ని వైద్య పరిభాషలో గైనోపోబియా అంటారు.
ఇతడికి 16 వ సంవత్సరం నుంచి మహిళలంటే ఒక రకమైన భయం ఏర్పడింది. అప్పటి నుంచి తనకు తాను ఇంట్లోనే బందీగా ఉండిపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు చనిపోయాక 15 అడుగులు ఎత్తైన కొయ్యలతో ఇంటిచుట్టూ ఒక ఫెన్సింగ్ తయారు చేసుకొని ఇల్లు కట్టుకుని ఉండిపోయాడు . అప్పటినుంచి ఇతడు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ అక్కడే వండుకుని భోజనం చేస్తూ అక్కడే నిద్రపోతున్నారు. తనకేదైనా అవసరం అయితే ఇతరులుకు , ఫెన్సింగ్ ఇవతలనుంచే చెప్పి, గేటు ముందే ఆ వస్తువులను పెట్టించుకుంటాడు .
రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జన సంచారం తగ్గిన తర్వాత ముసుగు కప్పుకొని వస్తువులు ఇంట్లో పెట్టుకుంటాడు. ఇతనికి మహిళలంటే ఇంత భయం ఉన్నప్పటికీ చుట్టుపక్క మహిళలే ఇతడికి అవసరమైన వస్తువులను ఆహారాన్ని గేటు ముందు వదిలిపోతుంటారు . రాత్రి సమయంలోనే కవాటిని తీసుకొని పోతాడు. ఎవరిని తన దగ్గరకు కూడా రానివ్వడు. గైనోఫోబియా లక్షణాలున్న వాళ్ళకి మహిళలను చూస్తే గుండె దడ ఎక్కువ ఉంటుంది . తన మీద దాడి చేస్తారుని భయం. వాళ్ళుకనపడితే ఏ పని చేసుకోలేరు. అందుకే మహిళలకు దూరంగా ఉంటారు.

