విశ్వాంతరాళ అద్భుతాలు అనంతం. అవి అంతుబట్టని రహస్యాలు . అందుకనే ఎంత శోధించినా విశ్వంతరాళాన్ని అర్థంచేసుకోవడం అంటే మాటలు కాదు. ఇప్పటివరకు వందలో ఒకటో వంతు కూడా విశ్వంతరాళ రహస్యాలను ఖగోళ శాస్త్రం గాని ,శాస్త్రవేత్తలు గాని కనుక్కోలేకపోయారు . అదే సృష్టి రహస్యం అంటే. అలాంటి విశ్వాంతరాళ రహస్యాలను శాస్త్రవేత్తలు నిరంతరం శోధిస్తూనే ఉన్నారు. పరిశోధనలు చేస్తూనే ఉన్నారు . అయినా అంతు బట్టని ఆ విశ్వ రహస్యాలకు ఆది, అంతం ఎక్కడో తెలియని పరిస్థితి. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వాంతరాళంలో సుదూర తీరాలను చిత్రీకరిస్తోందట . ఇంతకీ ఈ టెలిస్కోపు ఎక్కడుందో తెలుసా ?
15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో దీన్ని ఉంచారు . ఇది హబుల్ టెలిస్కోప్ మాదిరి అంతరిక్షంలో పరిభ్రమిస్తూ అంతరిక్షాన్ని చిత్రీకరించదు.. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోపు భూమి సూర్యుడు ఆకర్షణ శక్తులు కలిసే ఒక కేంద్రకంలో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంచారు . దీన్ని లాక్ రేంజ్ టూ అంటారు . అంటే భూమి సూర్యుడు గురుత్వాకర్షణ శక్తులు అక్కడ కేంద్రీకృతం అవుతాయి . అందుకే దాన్ని లాక్రేంజ్ టు అని ఖగోళ శాస్త్రంలో పేర్కొంటారు. ఆ కేంద్రకంలో ఉన్నప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అక్కడ నుంచి ఇక కదలదు. అక్కడే స్థిరంగా ఉండి అంతరిక్షాన్ని చిత్రీకరిస్తుంది . ఇలాంటి టెలిస్కోపు ప్రపంచంలో ఇదొక్కటే. ఇదే నిరంతరం అంతరిక్షాన్ని పరిశోధిస్తుంది .
ఈ టెలిస్కోప్ ను మైనస్ 225 డిగ్రీల సెంటిగ్రేడ్లో
ఈ టెలిస్కోపు కొన్ని కోటానుకోట్ల మైళ్ళ దూరంలో ప్రయాణించే ఖగోళ అద్భుతాలను చిత్రీకరిస్తుంది . ఒక కాంతి సంవత్సరం అంటే 365 రోజులు . అలాంటి పదమూడు వేల కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణించే కాంతి విధానాన్ని ఇది చిత్రీకరిస్తుంది. ఒక కాంతి సంవత్సరం భూమి నుంచి లెక్కించేందుకే 365 రోజులు పడితే 13 వేల కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణించే కాంతి అసలు ఎక్కడ నుంచి ఉద్భవించిందో ఆలోచిస్తేనే విశ్వ అద్భుతం అర్థం కాని రహస్యం. ఈ టెలిస్కోపు పరిశోధనలు చేసేది మనకు తెలిసిన గ్రహాలను కాదు దానికి మించిన దూరంలో ఉన్న గ్రహాల కోసం ఈ తెలుసుకోపు అన్వేషణ చేస్తుంది ఇంత వేడి వాతావరణం లో కూడా ఈ టెలిస్కోప్ ను మైనస్ 225 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉంచడం శాస్త్రవేత్తల అద్భుత మేధస్సుకు పనితీరు, నిదర్శనం .అంత శీతల ఉష్ణోగ్రతలో ఉంటేనే ఈ టెలిస్కోప్ పని చేయగలదు .
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

