అమరావతి వేశ్యల రాజధాని అన్న సాక్షి వ్యాఖ్యలకు జగన్, భారతి తనను అడగలేదని జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పడమే వింతగాఉంది. వాళ్ళు అడిగితే , క్షిగామాపణలు చెప్పమంటే చెబుతానై కూడా అన్నాడు. ఇలాంటి తలతిక్క వ్యాఖ్యలతో కొమ్మినేని మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అతడి వ్యాఖ్యలు ఒక రకంగా జగన్ , భారతి లను ఈ వివాదంలో ఇరికించడమే.. వాస్తవానికి తీవ్రమైన ఈ అంశంపై , జగన్ కానీ, సాక్షి ఎండి హోదాలో భారతి గానీ ఇంతవరకు స్పందించలేదు.
పరమ జుగుప్సాకరమైన ఈ డిబేట్ పై కూడా మాట్లాడలేదు. అమరావతి వేశ్యల రాజధాని అన్న కృష్ణమరాజుకూడా పెద్ద జర్నేల్సిట్ ఏమీకాదు. సాక్షిలో డిబేట్స్ కోసం , గతంలో షుగర్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగం పోగొట్టుకుని జర్నలిస్ట్ అన్న టాగ్ తగిలించుకున్న కుహనా మేధావి. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే , ఈ డిబేట్ అత్యంత నీచమైన, జుగుప్సాకరమైన రీతిలో సాగింది. రాష్ట్రంలో మీడియా అటు, ఇటుగా చీలిపోయి అసత్యాలకు ఆలవాలం అయిపొయింది.
ఈ పరిస్థితుల్లో అమరావతిపై సాక్షి డిబేట్ అత్యంత నీచమైన కార్యక్రమం.. రాష్ట్రంలో జర్నలిజం దాదాపుగా అమ్ముడుపోయిందని, ఎవరినో ఒకరిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ నిజాలకు పాతర వేసిందనేది సామాన్య జనం అభిప్రాయం. అందుకే జనం వాటిని చూడటం కూడా తగ్గించేశారు. టిఆర్పి రేటింగ్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో కొమ్మినేనిని అరెస్ట్ చేయడం సమంజసమే .జర్నలిస్టుల ముసుగులో ఏమిమాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న భ్రమల నుంచి జర్నలిస్టులు బయటపడాలి..

