అంతరిక్ష ప్రయోగాలలో అప్రతిహత విజయాలతో, భారత కీర్తి పతాకను నింగిలో ఎగరవేస్తున్న ఇస్రో మరో అద్భుతాన్ని సాధించబోతోంది . శ్రీహరికోట ఇస్రో కేంద్రంలో మూడో లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు . దీనికోసం 3985 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. 2029 మార్చి నెల నాటికి మూడో లాంచ్ బ్యాడ్ సిద్ధం చేస్తారు. అంతరిక్ష విజ్ఞానంలో కొత్త పుంతలు తొక్కుతున్న శాస్త్రవేత్తలు తాజాగా ఏఎస్ఎల్వీ నుంచి మొదలుపెట్టి పిఎస్ఎల్వీ ,జిఎస్ఎల్వీ వరకు ఉపగ్రహ వాహక నౌకలను ప్రయోగించి ఇప్పుడు ఎన్ జి ఎల్వి రాకెట్ల ప్రయోగానికి ఈ మూడో లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తున్నారు. అంటే అతి పెద్దదైన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు .
ఈ లాంచ్ ప్యాడ్ నుంచి భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాలకు ,చంద్రమండలానికి మానవరహిత మరియు మానవులతో కూడిన రాకెట్లు పంపుతారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి క్యాప్సూల్స్ ను పంపే ఏర్పాటు కూడా ఈ కేందం నుంచే జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు . సూర్య గ్రహాని వలయాలకు కూడా వ్యోమగాములను కూడిన క్యాప్సూల్ పంపే దానికి అనుకూలంగానే ఈ మూడో లాంచ్ బాడ్ ను సిద్ధం చేస్తున్నారు . దీని నుంచి అతి బరువైన మరియు అతి పొడవైన ఉపగ్రహ వాహక నౌకలను కూడా దీన్నించే ప్రయోగిస్తారు .

