అప్రతిహత అంతరిక్ష విజయాలతో దూసుకుపోతున్న భారతీయ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట.. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగాలు భారత్ ను అగ్రదేశాల సరసన నిలబెట్టాయి. ఇప్పుడు శ్రీహరికోట అంతరిక్ష కీర్తి కిరీటంలో మరో మైలురాయి చోటుచేసుకుంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరియు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ఒక ఉపగ్రహాన్ని జూలై నెలలో అంతరిక్షానికి ప్రయోగించనున్నాయి. అత్యంత ప్రతిష్టకరమైన ఈ ప్రయోగానికి 1500 కోట్ల రూపాయలు వ్యయం కానుంది. జూలై నెలలో ఒక సింథటిక్ అపర్చూర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది అంతరిక్షం నుంచి భూమి వాతావరణాన్ని ,మరియు నీటి వినియోగాన్ని మరియు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులను పరిశీలించి నివేదికలు అందజేస్తుంది.
ప్రపంచ వాతావరణ భూగోళిక అధ్యయన రంగాలలో ఇలాంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఇస్రో ప్రతిష్టాకరమైన ఉపగ్రహ వాహక నౌక GSLV MKII నుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం కూడా శ్రీహరికోట నుంచి జరగనుంది. అయితే జూలై నెలలో ఏ తేదీన ప్రయోగిస్తారు అన్న విషయం మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. శ్రీహరికోట నుంచి నిర్వహిస్తున్న అంతరిక్ష ప్రయోగాలలో 95 శాతం విజయవంతమయ్యాయి. సూర్య వలయంలో చోటు చేసుకునే మార్పులకు సంబంధించి మరియు చంద్రుడు పై అధ్యయనాలకు శ్రీహరికోట నుంచి ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి. ఇవి కూడా పాక్షికంగా విజయం సాధించాయి. ఈ విజయాలు స్ఫూర్తితో శ్రీహరికోట నుంచి మరో చంద్రయాన్ ప్రయోగానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని కూడా అధ్యయనం చేసే ఉపగ్రహాన్ని పంపే ఆలోచనలో శ్రీహరికోట శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.
జూలై నెలలో ఇస్రో నుంచి మరో అద్భుతం

