అణ్వాయుధాల బూచీతో ఇంతవరకు ప్రపంచాన్ని భయపెడుతూ వస్తున్నా ఇరాన్ చావు దెబ్బ తినింది. తమ అణ్వాయుధాలతో తన జోలికొస్తే సర్వనాశనం చేస్తానంటూ చుట్టుపక్కల దేశాలను ,శత్రు దేశాలను ఇంతవరకు బెదిరిస్తూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు చిగురుటాకులా వణికి పోతుంది. అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయిల్ గత చేసిన దాడులతో కకావికలమైపోయింది .ఇరాన్ కీలక అణు స్థావరాలపై ఇజ్రాయిల్ 200 యుద్ధ విమానాలతో భీకరమైన దాడి చేసింది.
ఈ దాడి ఇంతటితో ఆగదని కొనసాగుతుందని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నేతాన్యాహూ ప్రకటించాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇజ్రాయల్ ను మెచ్చుకుంటూ 60 రోజుల లోపల అణ్వాయుధ రహిత ఒప్పందంపై సంతకం పెట్టాలన్న తన డిమాండ్ ను ఇరాన్ ఒప్పుకోలేదని అందుకే 61వ రోజు ఈ దాడి జరిగిందని చెప్పాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాస్కో అంటూ హెచ్చరిక జారీ చేశారు. దాడుల్లో పలు అణు స్థావరాలు ఇరాన్ లో ధ్వంసం అయ్యాయి.
ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ దళాల టాప్ కమాండర్ జనరల్ హుస్సేనీ సలామీ మరణించారు . దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో సలామీ ఒకరు. మరో టాప్ ర్యాంక్ మిలిటరీ మేజర్ జనరల్ మహమ్మద్ బగేరి కూడా ఇజ్రాయిల్ దాడుల్లో హతమయ్యారు. ఆపరేషన్ రైసింగ్ లైన్ పేరుతో ఇజ్రాయిల్ మొదలుపెట్టిన ఈ దాడిలో నాటాంజి అణ్వస్త్ర కేంద్రాన్ని ధ్వంసం చేశారు .
అక్కడ ఉన్న ఆరుగురు అణు శాస్త్రవేత్తలను కూడా ఈ దాడిలో చంపివేశారు . ఇది ఇరాన్ క్షిపణులకు , యుద్ధ సామాగ్రికి కీలక స్థావరం. ఈ దాడుల్లో ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారని ఇరాన్ కూడా ప్రకటించింది ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ డ్రోన్ దాడులను ప్రారంభించింది . అయితే అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని అమెరికా, ఇజ్రాయిల్ ప్రకటించాయి.

