తిరుమల ,అలిపిరి మరియు శ్రీవారి మెట్లదారులకు అటూ ఇటూ ఇనుపకంచె వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో తిరుమల కొండపైకి ఎక్కే భక్తులుకు , చిరుతలు, ఎలుగుబంట్లతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ మెట్ల దారులులో మెట్లకు ఇరువైపులా కంచె వేయాలన్న గతంలో ప్రతిపాదనలను అటవీ శాఖ తిరస్కరించింది. దీంతో కంచె వేయడం ఇబ్బందికరంగా తయారయింది. తిరుమల కొండ ప్రాంతం మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉంటుంది. ఏడుకొండలు అటవీశాఖ పరిధిలో ఉన్నప్పటికీ పైన శ్రీవారి నిలయం ప్రాంతం టిటిడి ఆధీనంలో ఉన్నప్పటికీ మొత్తం మీద దేనికైనా సరే అటవీశాఖ అనుమతులు కావాల్సిందే .
మెట్ల దారికి రెండువైపులా ఇనుప తీగలు కంచె వేస్తే వన్యప్రాణులు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని భావించి అటవీ శాఖ నిరాకరిస్తుంది . దీంతో ఇటీవల చిరుతల దాడిలో ఓ బాలిక మరణించిన నేపథ్యంలో కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం చేశారు . దీనిపై హైకోర్టు విచారణ చేసి మెట్ల దారికి అటు ఇటు కంచె వేయాలని ఆదేశాలు జారీ చేసింది . వన్యప్రాణులకు , వాటి రాకపోకలకు అవసరమైన విధంగా నే అండర్ పాస్ లు, ఫ్లయ్ ఓవర్ లు నిర్మించే ప్రతిపాదన పరిశీలించాలని కూడా ఆదేశించింది.
.అటవీ ప్రాంతాలలో రోడ్లు, వంతెనలు, ఫ్లయ్ ఓవర్లు కట్టేప్పుడు సాధారణంగా వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఫ్లైఓవర్లు గాని, అండర్ పాస్ గాని నిర్మిస్తారు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఆదేశాలతో టీటీడీ వన్య ప్రాణుల సంరక్షణకు ,వాటి రాకపోకలకు ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటూ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తిరుమల అటవీ ప్రాంతం ఎన్నో వన్య ప్రాణులకు ఆలవాలం. అరుదైన పుణ్యప్రాణులు తిరుమల కొండల్లో ఉన్నాయి. ఇప్పటికి మనిషికి కనిపించని అరుదైన జాతులు కూడా అక్కడే ఉన్నాయి . అటవీ శాఖ అంచనా ప్రకారం దాదాపు 400 రకాల అరుదైన వన్యప్రాణుల జాతులు ఇక్కడ ఆవాసంగా చేసుకొని ఉంటున్నాయి. అరుదైన వృక్ష జాతులకూ తిరుమల కొండలు ఆలవాలం.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

