ఇరాన్ బ్రెయిన్ చైల్డ్ షాహెద్ డ్రోన్ అమెరికాకు పిచ్చెక్కిస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నప్పటికీ ఇరాన్ షాహెద్ డ్రోన్ మాత్రం అమెరికా సైనిక శక్తికి లొంగడంలేదు. ఇదే ఇప్పుడు వాళ్ళ ఆలోచన అయింది.షాహెద్’ డ్రోన్ ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చివేస్తున్న ఒక విధ్వంసకర ఆయుధంగా మారింది. దీనిపోడవు 11 అడుగులు త్రికోణంలో రెక్కలతో ఉండే ఈ షాహెద్ డ్రోన్, 50 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా పాయింట్ పెట్టి కొడుతుంది. అందులోనూ తక్కువ ఎత్తులో దూసుకుపోవడం వాళ్ళ రాడార్ సిగ్నల్స్ కు కూడా అందదు.
అమెరికా స్థావరాలుగా ఉన్న గల్ఫ్ దేశాలలో షాహెద్ డ్రోన్లు సృష్టిస్తున్న బీభత్సం బీతావహంగా ఉంది.. గల్ఫ్ తీరంలో చమురు నిక్షేపాలు, దుబాయ్‌లోని విలాసవంతమైన కట్టడాలు మరియు ఎర్ర సముద్రంలోని భారీ నౌకలపై జరిగిన దాడుల వల్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. హైరైజ్ బిల్డింగ్స్ లక్ష్యంగానే దీంతో దాడులు చేస్తున్నారు.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 25 లక్షలతో తయారుచేసే షాహెద్ డ్రోన్ కూల్చివేతకు అమెరికా వదులుతున్న క్షిపణి 35 కోట్లు చేస్తోంది.
వందల కోట్లు విలువైన శక్తివంతమైన క్షిపణులను , సాధారణ ఇరాన్ డ్రోన్ లను కూల్చివేతకు అమెరికా ఖర్చుపెడుతొంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మరియు రాడార్ వ్యవస్థలు ధ్వంసం కావడమే కాకుండా, వాటిని పునరుద్ధరించడానికి అమెరికా ఖజానా నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.. శత్రువు ఒక్క డాలర్ ఖర్చు చేస్తే, దానిని అడ్డుకోవడానికి అమెరికా వేల డాలర్లు వెచ్చించాల్సి రావడం వాషింగ్టన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ఇరాన్ రహస్య ప్రదేశాలలో ఇలాంటి డ్రోన్లు వేల సంఖ్యలో సిద్ధంచేస్తోంది.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

