22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

అమెరికాతో ముస్లిం దేశాల మిలాఖత్ ,

ఇరాన్ వ్యూహం మార్చింది. తమ దేశంపై దాడికి సాటి ముస్లిం దేశాలే అమెరికాకు స్థావరాలు ఇచ్చాయి. ఇరాన్ పై దాడులు కూడా ముస్లిం దేశాలనుంచే అమెరికా చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్ గా ఇరాన్ ఇప్పుడు దాడులు చేస్తోంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్ లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్ గా ఇరాన్ దాడి మొదలు పెట్టింది .దీంతో హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్న ప్రజలతో గల్ఫ్ దేశాలలో భయానక వాతావరణం ఉంది.ఆ దేశాలలో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు.ఎప్పుడేం జరుగుతుందనే భయంలోఉన్నారు. ఇరాన్ ఇప్పుడు సాటి ముస్లిం దేశాలపై దాడులకు పూనుకుంది. అమెరికా సైనిక స్థావరాలన్నీ గల్ఫ్ దేశాలలోనే ఉన్నాయి.

గల్ఫ్ సముద్ర జలాలలనుంచే యుద్ధం జరుగుతొంది. ఒమాన్ దేశం తప్ప గల్ఫ్ తీరంలో మిగిలిన ముస్లిం దేశాలన్నీ అమెరికాకు దాసోహం అయినా దేశాలే. ఇజ్రాయెల్‌ సహా అమెరికా మిత్రదేశాలపై ఇరాన్‌ క్షిపణుల దాడి ఉదృతం చేసింది .కువైట్‌లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా మిస్సైల్స్‌ ప్రయోగించింది..గల్ఫ్ దేశాలలో అమెరికన్లు బయటకు రావొద్దని అప్రమత్తం చేసిన అమెరికా విదేశాంగ కార్యాలయం. . కువైట్‌లో మినా అల్ అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై కూడా దాడిచేసింది . ఖతార్ రాజధాని దోహా, అబుదాబిలో పేలుళ్ల శబ్దాలు. మరోసారి బహ్రెయిన్‌లోని యూఎస్‌ బేస్‌ను దెబ్బతీసిన ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది.

అబుదాబి, ఖతార్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మళ్లీ దాడులు మొదలుపెట్టింది.. తాజాగా సోమవారం ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించిన ఐడీఎఫ్‌. దుబాయ్‌, అబుదాబీ, ఖతార్‌లో పేలుళ్ల శబ్దాలతో భయానక వాతావరణం నెలకొనింది.ఇజ్రాయెల్‌ దాడులతో లెబనాన్‌లో 31 మంది మృతి చెందారు .లెబనాన్‌లో ఇరాన్ మద్దతు హెజ్‌బొల్లా నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. హెజ్‌బొల్లా మిలిటెంట్‌ సంస్థ దాడులకు ప్రతిదాడులు చేసిన ఇజ్రాయెల్. తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణిని కూడా నేలకూల్చామన్న ఇజ్రాయెల్ సైన్యం . గల్ఫ్ దేశాలలో ఆయిల్‌ రిఫైనరీలపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు ముమ్మరం అయ్యాయి. .ఆరామ్‌కో ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ దాడి చేసి . డ్రోన్లతో భారీ విధ్వంసం సృష్టించింది. దీనివల్ల రోజుకు 5.5లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.సముద్రంలో ఆయిల్ రిగ్గునుంచి మంటలు.ఎగిసిపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.