విమానం ముక్కు భాగం ఎంత ముఖ్యమో తెలుసా .? విమానయానంలో ఇంజన్ ఎంత ప్రధానమో ,విమానానికి ముక్కు భాగంలో ఉన్న పరికరాలు కూడా అంతే ముఖ్యం. విమానాన్ని నడిపించేది ఇంజన్ అయితే విమానాన్ని సక్రమమైన దారిలో క్షేమంగా గమ్యస్థానం చేర్చేది ముక్కు భాగం . అంటే ఫ్లైట్ నోస్ స్పాట్ . ఇది చూసేందుకు ఒక రేకు డోమ్ లాగా కనిపిస్తుంది. అయితే అది రేకు డోము కాదు. దాని లోపల కీలకమైన మిషన్ లు ఇంజన్లు ,సాఫ్ట్ వేర్ , రాడార్లు ఇవన్నీ ఉంటాయి.
ఈ భాగంలోని శక్తివంతమైన వాతావరణ రాడార్ వ్యవస్థ వందల మైళ్ళ దూరంలో వాతావరణాన్ని కూడా గ్రహించి విమాన పైలట్ లకు సమాచారం అందిస్తుంది . దూరంలో ఉన్న తుఫాన్లు దట్టమైన మేఘాల కారణంగా కలిగే ఓడుదుడుకులు ,కొండ ప్రాంతాల వివరాలను ఈ రాడార్ సిస్టం గ్రహించి విమానం సాఫీగా భద్రంగా పయనించేందుకు సమాచారం అందిస్తుంది. ఈ ముక్కు భాగంలోనే విమానం నియంత్రణ, గమనానికి సంబంధించిన కమ్యూనికేషన్ మరియు సేఫ్టీ సిస్టమ్స్ ఉంటాయి.
ఇవి చాలా ప్రధానమైనవి . ఇంత ప్రధానమైన ముక్కు భాగం అలంకారం కాదు . విమానానికి అది మెదడు లాంటిది . విమానాన్ని నడిపించేందుకు అవసరమైన సాంకేతిక సమాచార వ్యవస్థను అందజేసే భాగం. ఒక్కో దఫా పక్షులు కొడితే విమానాలు దిగిపోతాయి అని అంటారు. అది నిజమే. పక్షి దాడి చేసి ఢీ కొడితే విమానం కదిలే దానికి అవకాశం లేదు. ఎందుకంటే విమానాన్ని ఢీకొట్టే పక్షి ముఖ్యంగా ఈ ముక్కు భాగంలోనే ఢీకొడుతుంది .
ముక్కు భాగాన్ని ఢీ కొట్టినప్పుడు అది ఆకాశమార్గంలో భీకరమైన గాలులకు విచ్చిన్నవైపోయి విమానం ప్రమాదం లో పడే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ముక్కు భాగాన్ని తయారు చేసేది రేకుతో కాదు . ఒక పటిష్టమైన ఫైబర్ గ్లాస్ తో చేస్తారు. అది దాని లోపల ఉన్న రాడార్ సిస్టమ్స్ సంకేతాలను తీసుకునేందుకు, బయటికి పంపించేందుకు వీలుగా ఉండే పటిష్టమైన ఫైబర్ గ్లాస్ తో నిర్మిస్తారు . లేదంటే కెల్వార్ అనే పదార్థంతో నిర్మిస్తారు . ఇలాంటి పదార్థాలు నుంచి సిగ్నల్స్ తీసుకునేందుకు కానీ బయటికి వెళ్లేందుకు కానీ అవకాశం ఉంటుంది .

