వరదలను ఎదుర్కోవడంలో ప్రపంచానికి పాఠాలు చెప్పే దేశం నెదర్లాండ్స్ . ఎందుకంటే నెదర్ ల్యాండ్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఆ దేశం వరద విపత్తులను ఎదుర్కునేందుకు అనేక ప్రయోగాలు చేసి విజయాలు సాధించి ,ఇప్పుడు వరదల నుంచి విముక్తి పొందింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో ఈ దేశాన్ని మించిన దేశం లేదు . అయినా అన్నిటికంటే బలీయమైనది ప్రకృతి . కాబట్టి కొన్నిసార్లు ప్రకృతి విలయాలు తప్పవు . కానీ సాధ్యమైనంతవరకు మహాప్రళయాన్ని కూడా తగ్గించగల శక్తి నెదర్లాండ్ దేశానికి, ఆ దేశ శాస్త్రవేత్తలకు ఉంది . దీనికి కారణం భౌగోళికంగా నెదర్లాండ్స్ దేశం సముద్రమట్టం కంటే భూభాగం తక్కువ స్థాయిలోనే ఉంటుంది.
అందువల్ల సముద్రం పొంగినప్పుడు అలల తాకిడికి వరద నీరంతా నగరాలపై పడుతుంది. ఇందుకోసమే ఆ దేశం సముద్ర తీరం వెంబడి ఒక రక్షణ గోడను కూడా నిర్మించింది . ఇది నిర్మించిన తర్వాతనే సముద్రపు పోటు కారణంగా ఆ దేశానికి జరిగే ఉపద్రవం 85 శాతానికి పైగా తగ్గిపోయింది . ఇది కాకుండా ఇటీవల నెదర్లాండ్స్ లోని అన్ని నగరాలలో భారీ వర్షాలు వచ్చినా వర్షాలకు కాలువలు పొంగి వరదలు ముంచుకొచ్చినా అవి వీధుల్లోకి పోకుండా మళ్ళీ సముద్రంలోకి మళ్ళించేందుకు ఓ అద్భుతమైన సాంకేతిక పరికరాన్ని వారు ఏర్పాటు చేశారు . ప్రతి వీధిలో భూగర్భంలో వరదలను ఎదుర్కొనే రబ్బర్ గోడలను నిర్మించారు .
వర్షం వచ్చినప్పుడు వరద ముంచుకొస్తుంది అన్న సంకేతాలు వాటిలో సెన్సార్సు గ్రహిస్తాయి . వెంటనే వాటంతటవే గాలి బెలూన్ మాదిరి ఉబ్బి ఆ వీధిలో నీటి ప్రవాహానికి అడ్డంగా నిలిచిపోతాయి . కాంక్రీట్ గోడల కంటే శక్తివంతంగా సమర్థవంతంగా వరద ప్రవాహాన్ని ఒత్తిడిని ఉధృతిని తట్టుకునే శక్తి అడ్డుకునే శక్తి ఈ రబ్బర్ వాల్ కి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ .వరద ప్రవాహ వేగం ,ఒత్తిడి ,ఉధృతి బట్టి సెన్సార్లు ప్రమాదకర సంకేతాలను అందజేస్తాయి / సెన్సార్ నుంచి సంకేతం అందడంతోనే భూగర్భంలో ఉన్న ఆ రబ్బర్ గోడ పైకి లేస్తుంది . ఇది కాంక్రీట్ గోడల కన్నా సమర్థవంతంగా ధీటుగా వరద ప్రవాహాన్ని, ఒత్తిడిని, వేగాన్ని తట్టుకుని దాన్ని దిశను సముద్రం వైపు మళ్ళిస్తోంది. ఇదంతా అవసరం నేర్పిన విజ్ఞానం . ఆ దేశం ఎదుర్కొంటున్న విపత్తు నుంచి శాస్త్రవేత్తలు గుణపాఠాలు నేర్చుకొని ఇలాంటి సమర్థవంతమైన విధానాలను రూపొందించి తమ దేశాన్ని కాపాడుకున్నారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

