హానీ మూన్ కి పోయి అదృశ్యమైపోయిన కొత్త జంటలో భర్త మృతదేహం దొరికింది. భార్య ఆచూకిమాత్రం ఇంకా తెలియలేదు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన రాజారఘువంశీకి, సోనమ్ తో గతనెలలో పెళ్లయింది. వివాహం అయినా వారం తరువాత మేఘాలయకు హనీమూన్ కి వచ్చారు. కాశీ కొండల్లో విహార యాత్రకోసం బైక్ అద్దెకు తీసుకున్నారు.
గత నెల 23 తేదీనే తల్లితండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత కనిపించకుండాపోయారు. వారం రోజుల విస్తృత గాలింపు తరువాత ఒక వాటర్ ఫాల్స్ పక్కన రాజారఘువంశీ మృతదేహం పడిఉండటాన్ని కనుగొన్నారు. సోనమ్ ఆచూకీ మాత్రం దొరకలేదు. నూతన దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని మొదటినుంచి అనుమానాలు ఉన్నాయి.
అయితే రాజారఘువంశీ మృతదేహంమాత్రమే ఉంది. సోనమ్ ఏమైందనే అనుమానం ఇప్పుడు అంటూ చిక్కని సమస్యగా ఉంది. ఆమెకోసం గాలింపు తీవ్రమైంది. బైక్ అద్దెకిచ్చిన వారిని, గైడ్ ని విచారించాలని రాజారఘువంశీ బంధువులు అనుమానం వ్యక్తం చేసారు. ఇప్పడు సోనమ్ ని కూడా కిడ్నాపర్లు చంపేసారా..? లేక కిడ్నాప్ చేశారా ..?? లేక ఇంకేదైనా జరిగిందా అనేది అంతుపట్టని మిస్టరీగా మిగిలిపోయింది..

