భారత్ దెబ్బకు పాకిస్తాన్ అల్లాడిపోతోంది. యుద్ధం మొదలైన రెండో రోజలకే కకావికలమై అంతర్జాతీయ సమాజాన్ని ఆర్థిక సహాయం కోసం అర్ధిస్తోంది. మొదటిగా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్ సైన్యం కేవలం 9 ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసి విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా భారత్ లో ఉన్మాద హత్యాకాండకు ,విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న కరడుగట్టిన తీవ్రవాదులను పాకిస్తాన్ లోనే హతం చేసింది. అయితే కేవలం తీవ్రవాద స్థావరాలపైనే జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ రెచ్చిపోయింది . దాడుల్లో మరణించిన తీవ్రవాదులకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసి, అక్కడ మిలిటరీ అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న పౌర అధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదం తమ సిద్ధాంతమని పాకిస్థాన్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
ఇది భారత్ కు పుండు మీద కారం చల్లినట్టయింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాస్తవాదీన రేఖ వెంబడి దాడులకు తెగబడింది. అది చాలదన్నట్టు గత రాత్రి నుంచి భారత్ భూభాగంలోకి పాకిస్తాన్ విమానాలు చొచ్చుకు వచ్చాయి. దీంతో భారత్ సైన్యం సమర్థవంతంగా అత్యంత ప్రతిష్టాకరమైన, అత్యంత సాంకేతిక విలువలతో కూడిన పాకిస్తాన్ ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చేసింది. మరో రెండు మిగ్ విమానాలను కూడా కూల్చేసింది. ఇందులో ఒక యుద్ధ విమానం పైలెట్ పారాషూట్ సాయంతో దిగి లొంగిపోయాడు. ఆ తర్వాత అంతకుముందే భారత్ కరాచీ ఓడరేవు పైన ,కరాచీలోని కీలక స్థావరాలపైనా దాడులు చేసి విధ్వసం సృష్టించింది. లాహోర్ ,రావల్పిండి ,పెషావర్ లాంటి కీలక స్థావరాలపైన దాడులు చేసి భారీ ఎత్తున విద్వంసం సృష్టించారు. దీంతో పాకిస్తాన్ విచ్చలవిడిగా భారత్ భూభాగంలోకి పంపిన డ్రోన్ విమానాలను వరుసగా కూల్చేసింది.
గత రాత్రి 32 డ్రోన్ విమానాలు భారత్ వైమానిక దళం దాడులు దెబ్బకు నేలకూరిగాయి. ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ , రాజౌరి , అమృత్సర్ లాంటి ప్రాంతాలే లక్ష్యంగా వైమానికి దాడులకు, క్షిపణి దాడులకు దిగుతోంది. పాకిస్తాన్ ప్రయోగించే ప్రతి క్షిపణిని భారత్ దళాలు నిర్వీర్యం చేస్తున్నాయి . దీన్నిబట్టి భారత్ సైనిక సంపత్తి మరియు క్షిపణులు శక్తి ఎలాంటిదో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంతవరకు ఇంత శక్తివంతమైన క్షిపణులు భారత్ అమ్ములపొదిలో ఉన్నాయని ప్రపంచానికి తెలియదు .. యుద్ధం మొదలై రెండో రోజు కాకముందే పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో అలజడి చెలవేగింది. ఒక ఎంపీ అయితే ఆ దేశ జాతీయ పార్లమెంట్ లో ఏడ్చేశాడు.

