పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి సమాధానంగా యుద్ధమే అనివార్యమైతే భారత్ వైమానిక సంపత్తి ఎంత శక్తివంతమైనదో తెలుసా..? భారత్ వద్ద ఉన్న రాక్స్ విమానాలు అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగినవి రాఫెల్స్ తయారు చేసిన ఈ రాక్స్ విమానాలు దాడి చేస్తే పాక్ సరిహద్దుల్లోకి పోవలసిన అవసరమే లేదు . మన దేశ సరిహద్దుల నుంచే లక్ష్యాలను ఛేదించి క్షిపణులు వదలగల శక్తి రాక్స్ విమానాలకు ఉంది . ఈ విమానాలు 2050 కిలోమీటర్ల వరకు క్షిపణులను సంధించి లక్ష్యాలను నాశనం చేయగలవు . ఖచ్చితమైన గురి తప్పని లేజర్ సిస్టమ్స్ ,కంప్యూటర్ గైడెడ్ మిస్సైల్స్ ఇవన్నీ కూడా విమానంలోనే ఉంటాయి . అంత అధునాతనమైన రఫెల్ రాక్స్ విమానాలను సరిహద్దులు వెంబడి ఇప్పుడు మోహరించి ఉన్నారు .
ఇది కాక రుద్ర -3 క్షిపణులు అత్యంత శక్తివంతమైనవి. 550 నుంచి 600 కిలోమీటర్ల దూర లక్ష్యాలు చేదించగలవు. ఇకపోతే స్వదేశీయంగానే తయారైన బ్రహ్మాస్ క్షిపణులు పేరుకు తగ్గట్టే బ్రహ్మ క్షిపణులు. అత్యంత శక్తివంతమైనవి. సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగినవి. బ్రహ్మ క్షిపణులు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు పై చూసి దాడి చేయగలవు. లక్ష్యం తప్పకుండా నిర్దేశిత ప్రాంతాలపై స్థావరాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించగలవు. వీటిని కూడా ఇప్పుడు సరిహద్దులకు తరలిస్తున్నారు.
ఫ్రాన్స్ కు చెందిన హామర్ క్షిపణులు ఇంకా శక్తివంతమైనవి. ఏ వాతావరణంలో నైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలవు. అగ్నిని సృష్టించి భారీ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించగలవు . ఉపరితలం నుండి భూమి మీద ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో ఇతర క్షిపణలు లాగానే హేమర్ క్షిపణి గుండుసూది మోపిన అంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయి .పాకిస్తాన్ మీద యుద్ధమే అనివార్యమైతే శత్రు స్థావరం పైకి శక్తివంతమైన క్షిపణులుని సరిహద్దుల్లో మోహరించారు..

