22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

కార్తీకమాసానికి, విష్ణు పూజకు విశేష స్థానం

ప్రబోధిని ఏకాదశి రోజున దీపాలు వెలిగించి,పూజ చేస్తే.మేరు పర్వతమంత పుణ్యం కలుగుతుందని నమ్మకం.సనాతన ధర్మంలో కార్తీకమాసానికి, మహావిష్ణువు పూజకు విశేషమైన స్థానం ఉంది. కార్తీకమాసాన్ని విష్ణుమూర్తికి అంకితం చేయబడిన మాసంగా చెబుతారు.నారద పురాణంలో కార్తీక శుక్లపక్ష ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అత్యంత ప్రధానమైనది. కార్తీక శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ప్రబోధిని ఏకాదశి నాడు విష్ణువు మేలుకుంటాడని,ఆధ్యాత్మిక మేలుకొలుపు శక్తిని తీసుకొస్తాడని నమ్ముతారు.ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు పూజ చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

వేదం చదవడం వల్ల కలిగే పుణ్యానికి కోటిరెట్ల ఫలం

ఏకాదశి రోజున చిన్న పుణ్యకార్యం చేసినా.అది మేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుందని భావిస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు,యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగే పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఏకాదశి లో ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పినట్లు పురాణంలో ఉంది. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రబోధిని ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించే మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.