22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

చెట్టుతొర్రలో సారాయి, డ్రోన్ పట్టేసింది.

తిరుపతి జిల్లా యర్రవారి పాళ్యం పోలీసు స్టేషన్ పరిధిలోని నాటుసారా స్థావరాలపై అధునాతన డ్రోన్స్ సమాచారంతో దాడులు చేశారు. చెట్టు తొర్రల్లో దాచిన సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సీక్రెట్ డెన్ ని అధునాతన డ్రోన్ కెమెరా పసికట్టిపట్టించింది. యర్రవారిపాళ్యం మండలం లోని వేములవాడ గ్రామం, తలకోన వాటర్ కెనాల్ సమీపంలో గుట్టుచప్పుకాకుండా చెట్టుతొర్రను లో ఉన్న తొమ్మిది లీటర్ల నాటు సారాయిను పోలీసు సిబ్బంది పట్టున్నారు.

చెట్టు తోర్రలో పెట్టినా ఎక్కడ దాచిపెట్టినా తిరుపతి జిల్లాలోని అధునాతన డ్రోన్ కెమెరా తో పట్టుకుంటామని ఎస్పి వి.హర్షవర్ధన్ రాజు అన్నారు. డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వేంటనే స్ధానిక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నాటు సారాయి కాసే ఇద్దరు రహస్యంగా తప్పించుకు పారిపోతున్న వేముల హనుమంతు, ఎస్ మునిస్వామిని పోలీసు సిబ్బంది రౌండప్ చేసి పోలీసు సిబ్బంది పట్టుకున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.