చిన్న వయసులోనే ఓ ఐఏఎస్ అధికారి లంచం తీసుకుంటూ చిక్కిపోయాడు.ఐఏఎస్ అయినా ఐదేళ్లకే అయ్యగారు లంచాలకు మరిగాడు. బ్రష్టుపట్టిపోయి చివరకు విజిలెన్స్ కి చిక్కి జైలు పాలయ్యాడు. ఒరిస్సాలోని కలహండి జిల్లా ధర్మగఢ్ సబ్-కలెక్టర్ గా పనిచేస్తున్న ధీమాన్ చక్మ, అనే ఐఎస్ అధికారి ఒక వ్యాపారి నుంచి 10 లక్షలు రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ధీమాన్ చక్మ ఒక స్థానిక వ్యాపారిని ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించి, మొత్తం 20 లక్షలు లంచం డిమాండ్ చేశారని విజిలెన్స్ అధికారులు చెప్పారు.
దీంతో ఆ వ్యాపారవేత్త ముందుగా రూ.10 లక్షలు చెల్లించినప్పటికీ, ఆ తర్వాత విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు..అప్రమత్తమైన అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు.ఆదివారం ధీమాన్ తన ప్రభుత్వ నివాసంలో వ్యాపారి నుంచి మిగిలిన .10 లక్షల రూపాయలు లంచం తీసుకుని, ఆ డబ్బును టేబుల్ డ్రాయర్‌లో పెడుతుండగా విజిలెన్స్ అధికారులు ఆయనను పట్టుకున్నారు..లంచంగా స్వీకరించిన రూ.10 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ సమయంలో ఆయన నివాసం నుంచి వివిధ డినామినేషన్లలో ఉన్న 26 కట్టల కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. అలాగే విజిలెన్స్ అధికారులు ధీమాన్ అధికారిక నివాసంలో ఇంకా లోతుగా సోదాలు నిర్వహించగా, అదనంగా మరో రూ. 47 లక్షల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు..ఈ భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు..ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం 2018, సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు..

