వాతావరణం సమతుల్యం దెబ్బతింటుంది . నానాటికీ పెరిగిపోతున్న వాహనాలు నుంచి, పరిశ్రమలనుంచి వెలువడుతున్న కాలుష్యాలు వీటన్నింటితో ప్రపంచ వాతావరణం వేడెక్కుతోంది .కాలుష్య మరణాలు వినాశనాన్నిసృష్టిస్తున్నాయి.అందువల్లే కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రపంచం పనిచేస్తుంది. శాస్త్రవేత్తల ఘోష ఇది ఒక్కటే .. కాలుష్యాన్ని తగ్గిస్తేనే భావితరం ప్రశాంతంగా ,కష్టాలు ,జబ్బులు లేని జీవితాన్ని అనుభవించగలదు . దాదాపుగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు నగరాల్లో స్వస్తి పలుకుతున్నారు . ఇప్పుడు కొత్తగా విద్యుత్ కార్లు ప్రవేశిస్తున్నాయి. వీటికి అదనంగా హైడ్రోజెన్ కార్లు కూడా త్వరలో రంగ ప్రవేశం చేయబోతున్నాయి .
ఫ్రాన్స్ లో ఒక అద్భుతమైన హైడ్రోజన్ కారుకు రూపకల్పన చేస్తూఉన్నారు. నామ్ అనే కంపెనీ తయారు చేసే హైడ్రోజెన్ కారు ఐదు నిమిషాల్లో ఫిల్లింగ్ పూర్తిచేసుకుని ఒకే దఫా 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదట . ఇలాంటి కారు ప్రయోగాత్మక దశలో పూర్తిగా విజయవంతమైందని నామ్ కంపెనీ చెబుతుంది. ఫ్రాన్స్ లో హైడ్రోజన్ కార్లు తయారీలో ఎనిమిది కంపెనీలు పూర్తిగా నిమగ్నమై ఉన్నాయి. హైడ్రోజన్ తయారీ ఒకటే దేశంలో ఇంధనం పొదుపు చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు , మానవాళిని కార్బనీకరణ వినాశనాల నుంచి ప్రశాంతంగా బ్రతికేందుకు ఉపయోగపడుతుందన్నది శాస్త్రవేత్తల భావన.. ఇది నిజం కూడా.. భూగోళాన్ని వాహనాల కాలుష్యం నుండి కాపాడే చర్య ప్రస్తుతానికి ఇదొక్కటే

