ప్రియుడితో కలిసి భార్య తనను అంతం చేస్తుందని భయపడ్డ భర్త ఆమెకు ప్రియుడితోనే పెళ్లి చేసేసాడు. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల అక్రమ సంబంధాల మోజులో భర్తలను చంపేసే భార్యల సంఘటనల నేపథ్యంలో ఓ భర్త తన భయానికి చెప్పి , భార్యకి ప్రియుడితో పెళ్ళిచేసాడు. కతార్ మిశ్రా అనే గ్రామానికి చెందిన బబ్లూ, రాధిక భార్యాభర్తలు. ఏడాదిన్నర కాలంగా రాధిక విశాల్ కుమార్ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. పలుదఫాలు హెచ్చరించినా ఆమె వినలేదు.
ఇటీవల మీరట్ లో మస్కన్ అనే మహిళాప్రియుడు సాహిల్ కలిసి , భర్తను చంపేసి , రంపంతో కోసేసి డ్రమ్ములో వేసి , దానిలో సిమెంట్ పోసి నీళ్ళుపోసి మూతపెట్టేసింది. గడ్డకట్టిపోయిన డ్రమ్ముని అలాగే ఉంచేసి పదిరోజులు విహార యాత్రకు పోయివచ్చి , డ్రమ్ముని కదిలించేందుకు కూలీలను పిలిచి చిక్కిపోయారు.. సంఘటనతో భయపడిపోయానని బబ్లూ చెప్పాడు. ఇదేకాకుండా భర్తలను ప్రియుళ్ళతో కలిసి అంతంచేసే ఘటనలు జరుగుతుండటంతో , తన ప్రాణానికి హాని ఉందని భయపడే , తానే తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేశానని బబ్లూ చెప్పాడు.

