22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

తొమ్మిదినెలల గర్భంతో ఉన్న భార్యను ..

మరో మూడు రోజుల్లో బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న భార్యను అత్యంత దారుణంగా చంపిన భర్తపై కఠినమైన చట్టాలకింద కేసుపెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తొమ్మిది నెలల గర్భవతి అయిన భార్యను, ఆమె కడుపులో బిడ్డను చంపేసిన వ్యక్తికీ ఉరిశిక్ష పడే చట్టాలకింద కేసుపెట్టాలని కోరుతున్నారు. హిందూస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పనిచేసే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి , అనూష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

విశాఖపట్నంలో గతఏడాదే పెళ్లయింది. ప్రస్తుతం దువ్వాడలో కాపురం ఉంటున్నారు. అనూష తొమ్మిదో నెల గర్భంతో ఉంది. మరో మూడు రోజుల్లో కాన్పుకోసం హాస్పిటల్లో చేరాల్సిఉన్న తరుణంలో , భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు. మొదట ఆమె స్పృహతప్పిపోయిందని , ఆ తరువాత చనిపోయిందని బుకాయించే ప్రయత్నం చేసాడు. అయితే పోలీస్ విచారణలో నేరం ఒప్పుకున్నాడు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.