22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

వారంలో ఒకపూట ఉపవాసం భలే ఆరోగ్యం

పూర్వకాలంలో పెద్దలు ఉపవాసం పరిపూర్ణమైన ఆరోగ్యానికి నాంది అని ఎందుకు చెప్పారో ఇప్పుడు ఆధునిక యుగంలో శాస్త్రవేత్తలు కూడా అదే చెబుతున్నారు . ఉపవాసం అంటే రోజు ఉపవాసం చేయడం కాదు ,వారానికి గరిష్టంగా రెండు పూటలా కనీసం ఒక పూట ఉపవాసం అనేది ఆరోగ్యకరమైన అలవాటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . మనిషి ఆకలితో ఉన్నప్పుడు అంతర్గతంగా అద్భుతమైన మార్పులు జరుగుతుంటాయని వివరించారు . దేహానికి ఆహారం అందకుండా దాన్ని ఉపవాసం ఉంచితే అది ప్రకృతి సిద్ధంగానే తనంత తానుగా దేహంలో అధికంగా ఉన్న చెడు పదార్థాలను హరిస్తుందని చెబుతున్నారు . దీనినే సైన్స్ పరిభాషలో ఆటో ప్యాజి అంటారు.

ఈ స్థితిలో శరీరం అనా అనారోగ్యంతో ఉన్న కణాలను ,వృద్ధాప్యకారక కణాలను, క్యాన్సర్ కారక కణాలను, లేదా మృత కణాలను శరీరంలోనే ఉండిపోయిన కణాలను శుద్ధిచేసి బయటకు పంపించి వేస్తుంది . దీన్ని అంతర్గత పరిశుభ్రత అని కూడా పిలుస్తారు . ఈ మెకానిజం దేహానికి ఉంది . వృధాగా పడి ఉన్న కణజాలాలను మళ్లీ పునరుత్పత్తి చేస్తుంది . తద్వారా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఉపవాసం అనేది శరీరంలో అధికంగా ఉన్న క్యాలరీలను నిరోధిస్తుంది. ఈ రసాయనిక చర్య ను డిటాక్స్ ఫికేషన్ అంటారు.

శరీరంలో వృధాగా ఉన్న హానిచేసే పదార్థాలను బయటకు పంపేందుకు ఉపవాసం మంచి ఆరోగ్యకరమైన ఉపాయం. అంటే దానికి వేరే మందులు వాడనక్కర్లేదు . ఒక పూట ఉపవాసం ఉంటే శరీరంలో వ్యర్థంగా ఉన్న రసాయనాలను కూడా ఉపవాసం ద్వారా బయటికి పంపించేస్తుంది. అందువల్ల ఉపవాసం అనేది పునరుత్తేజం కలిగించి కొత్త జీవితాన్ని ప్రసాదించేది . దేహంలో వ్యర్ధంగా పేరుకుపోయిన కణాలను, రసాయనిక పదార్థాలను బయటికి పంపించే విధానం. లేదా తనను తాను జీర్ణం చేసుకుని బయటే పంపించేది . ఈ ఉపవాసం శరీరంలో అంతర్గతంగా లోపాలను నయం చేసుకునే ఒక అద్భుతమైన విధానం అని తెలియజేశారు.

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.