22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

రాళ్ళపైన చెట్లు పెరగడంలో ఇదీ జీవ రహస్యం.

ప్రకృతి చాలా విచిత్రమైనది. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులైనా , ప్రతికూలతలనైననా అనుకూలంగా మార్చుకోగల శక్తివంతమైంది . చెట్లు భూమిలోనే పెరుగుతాయి అన్నది ,అన్ని సమయాల్లో వాస్తవం కాదు. చెట్లు రాళ్ళలోనూ పెరుగుతాయి . రాళ్ళ మీద పెరుగుతాయి. ఇది ప్రకృతి నేర్చుకున్న ఒక జీవన విధానం . ఆటుపోట్లను ,ఒడిదుడుకులను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పెరగగల శక్తి వృక్షాలకు ఉంది. రాళ్లలో ఉన్న చిన్న చిన్న సందుల్లో విత్తనాలు పడి మొలకలు వస్తాయి. ఈ మొలకలే చిన్నగా మొక్కలై ,మానులవుతాయి . రాళ్ళను చీల్చుకుంటూ తమ జీవనానికి అవసరమైన పోషకాలను సమకూర్చుకుంటాయి.

చాలా వరకు రాళ్లలో నీటిని తేమరూపంలో నిలువ చేసుకోగల సామర్థ్యం ఉంటుంది.. ప్రవాహాల నుంచి భూమిద్వారా తేమను పీల్చుకోగల శక్తి ఉంటుంది. ఇటువంటి రాళ్లు చెట్లు పెరిగేందుకు అవకాశం ఇస్తాయి. రాళ్లలో పెరిగే చెట్లు క్రమక్రమంగా వేర్లను విస్తరించుకుంటూ ,అవసరమైన పోషక పదార్థాలు ఉన్న దారులు ఎదుర్కొంటూ ,రాతి పొరల్లోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయి. తనకు అవసరమైన ఖనిజ లవణాలను కూడా రాళ్లు నుంచే మొక్కలు సేకరిస్తాయి. ఒత్తిడి వల్ల ఈ వేళ్ళు క్రమంగా భూమి ఉన్నచోట కూడా కొన్ని దఫాలు చేరుకుంటాయి.

అలా చేరుకోకపోయినా రాళ్లలోనే అవసరమైన ఖనిజాలను, నీటిని ,తేమను వెతుక్కునిపోగల శక్తి వేర్లకు ఉంటుంది. చెట్టు పెరుగుదలకు నైట్రోజన్ అవసరమైన పోషకం. నైట్రోజన్ కు చెట్టుకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. ఇలాంటి సమయంలో రాళ్ళల్లో నైట్రోజన్ ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా నుంచి చెట్టు వేళ్ళు నైట్రోజన్లు తీసుకుంటాయి. ఇలా చెట్టు రాళ్ళలో బ్రతికేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంది. ఇది మనిషి జీవితానికి, జీవనాన్ని కూడా ఒక మార్గదర్కకం , ఒక గుణపాఠం . ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రతిబందకాలలో కూడా ఎలా బ్రతకాలని నేర్పించేది రాళ్లలో పెరిగే చెట్టు..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.