22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

భోజనం చేసి బిల్లుకట్టకుండా వచ్చేయొచ్చు

అన్నదానాలు ,అన్నదాన సత్రాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచే కాదు పురాతన కాలం నుంచి ఉన్నవే. కాకపోతే ఇప్పుడు అన్నదానాలలో ప్రచారం ఎక్కువ, దానం తక్కువ. పురాతన కాలంలో ఆకలి వేసిన వారికి భోజనం పెట్టడం అనేది మానవత ధర్మం . అదో సాంప్రదాయం. అందుకే అతిథిదేవో భవ అన్న సామెత ఉంది. ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెడితే సర్వపాప హరమని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ కాలం పోయింది . నిస్వార్థంగా ఆకలిగొన్న వారికి భోజనం పెట్టె పరిస్థితి లేదు. గతంలో డబ్బులకు అన్నంపెట్టే పూటకూళ్ళు, లేదా హోటళ్లలో కూడా రోజుకు కొంతమంది పేదలకు ఉచితంగా పెట్టి, తరువాత వ్యాపారం మొదలుపెట్టేవారు. ఇప్పుడు ఆ అలవాటుపోయింది.

ఎంతైనా తినొచ్చు, ఎవరూ ఏమీ అడగరు

అయితే అమెరికాలోని అలబామాలోని బ్రూటన్ లోని ఓ రెస్టారెంట్ ఉంది . ఆ రెస్టారెంట్ పేరు డ్రగ్స్ వెల్ అండ్ హనీ బీస్ .. డ్రగ్స్ వెల్ అండ్ హనీ బీస్ రెస్టారెంట్. పేరుకు తగ్గట్టే ఆ రెస్టారెంట్ యజమాని కూడా దయామయుడు .ఇది అందరూ అనుకుంటున్నట్టు మామూలు రెస్టారెంట్ కూడా కాదు . ఆ రెస్టారెంట్లోకి ఎవరైనా పోవచ్చు. ఎంతైనా తినొచ్చు. అక్కడ ఉన్న ఆహార పదార్థాలలో దేన్నైనా అడిగి తినేయవచ్చు . అయితే అక్కడ బిల్లు కట్టాల్సిన అవసరం కూడా లేదు. బిల్లు కట్టకుండా కూడా తిరిగి దర్జాగా వచ్చేయొచ్చు. ఎవరిని ఏమీ అనరు , అడగరు కూడా. క్యాష్ కౌంటర్ కూడా ఉండదు. బిల్లు వేసేందుకు వెయిటర్ కూడా ఉండడు. ఇదేంటిది ఇలాంటిది రెస్టారెంట్ ఉంటుందా అన్న అనుమానవద్దు. నిజంగానే ఉంది.

అక్కడున్న హుండీలో డబ్బులు వేయమని కూడా చెప్పరు

అక్కడ మెనూ కార్డులు కూడా ఉండవు . ఎవరు ఎంతైనా తిని వచ్చేప్పుడు అక్కడొక హుండీ ఉంటుంది . ఆ హుండీలో మీకు నచ్చినంత డబ్బులు వేసి రావచ్చు . డబ్బులు లేకపోతే నేరుగా తినివచ్చేయొచ్చు. అక్కడే ఒక బోర్డు కూడా ఉంటుంది . అవసరమైన వాళ్ళకి భోజనం పెడతాను ,అన్నార్తులకు ఆకలి తీరుస్తామని, అందువల్ల ఈ ఒక్క బోర్డు చూసే ఉన్నవాళ్లు ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే వచ్చేయొచ్చు. అయితే ఎంతైనా కడుపుకు తిన్నాముకదా , అందులోనూ మంచి భోజనం.. అందుకే ఉన్నవాళ్లు దండిగానే డబ్బులు గుండెలో వేసి వస్తారు. దానితోనే ఈ హోటల్ ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడుతుంది . నిజంగా ఎంత గొప్ప హోటల్లో చూడండి.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.