అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన బోయింగ్ AI171 విమానం సాంకేతికంగా ఉన్నతమైన ప్రమాణాలతో ఉండేది. బోయింగ్ 787 ఈ విమానాల రకంలో ఇంతవరకు ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే ప్రధమం. 2013 డిసెంబర్ నుంచి ఈ విమానాలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం 13 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిందే. 41 వేల గంటలు ప్రయ్నమ్ చేసింది. 8 వేల టేకాఫ్ లు తీసుకుంది. 13 వేల 750 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేయగలదు .
ఇలాంటి విమానాలు ఎయిర్ ఇండియా వద్ద 34 ఉన్నాయి. మరో 27 కొత్త విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఇండిగో కూడా ఇప్పుడు ఇలాంటి విమానాలనే ఆర్డర్ పెట్టింది. 57 మీటర్ల పొడవు,17 మీటర్ల ఎత్తుతో , 60 మీటర్ల రెక్కలు పొడవుతో రాజసం ఉట్టిపడేట్టు ఉండే ఈ విమానం ప్రమాదంలో అసలేమిజరిగిందో ఫ్లయిట్ డేటా రికార్డర్, బ్లాక్ బాక్స్ చూస్తేకాని అర్ధంకాదు.ఈ విమానంలో 8 బిజినెస్ క్లాస్ సీట్లు, 238 ఎకానమీ సీట్లు ఉన్నాయి.

