మన దేశంలో వాయిదాల పద్ధతి మీద వస్తువులు కొనుగోలు చేసే అలవాటు ఎక్కువైంది. దాదాపుగా ఏడాదికి 330 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యాపారం ఇన్స్టాల్మెంట్ మీద వస్తువులు కొనుగోలు చేసే అతిపెద్ద నగదు బదిలీ విధానంగా మారింది. ఈ వాయిదాల పద్ధతి మీద చేసే వ్యాపారం ఆసియా దేశాల్లో మనదేశంలోనే ఎక్కువగా ఉంది. భారతీయులు తమనెల ఆదాయంలో మూడు వంతు భాగాన్ని ఈ వాయిదాల మీద వస్తువులు కొని చెల్లింపులు చేసేందుకు ఖర్చు పెట్టేస్తారు. దీంతో నగదు, పరపతి మధ్య నిష్పత్తి ఎక్కువైంది. డెబిట్ కార్డులు ఈఎంఐ నెలసరి వాయిదాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు కూడా పాకాయి.
మరీ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఐఫోన్ కొనుగోలు చేయడం అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారింది. ఐ ఫోన్ కొనాలంటే దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి. ఐఫోన్లు కోటీశ్వరులే కొంటారు అన్న మాట నిజం కాదు సామాన్య మధ్య తరగతి కుటుంబంకులో కూడా ఐఫోన్ వాడటానికి ఎక్కువగా అలవాటు పడ్డారంటే ఐఫోన్లు పిచ్చి మన దేశంలో ఎంతమందికి పోయిందో అర్థం చేసుకోవచ్చు . వాయిదాల పద్ధతి మీద తీసుకుని ఫోన్లలో 70 శాతం ఐఫోన్లు వాయిదాలు పద్ధతి మీదనే తీసుకుంటున్నారు. 80 శాతం కార్లు కూడా వాయిదాలు పద్ధతిని తీసుకుంటున్నారు. 60 శాతం గృహ నిర్మాణాలు వాయిదాల ప్రాతిపదికనే జరుగుతున్నాయి.
2024లో పరిశీలన ప్రకారం మధ్యతరగతి ప్రజలు ఈ వాయిదాల సంస్కృతికి బాగా అలవాటు పడిపోయారు. 33శాతం నెల ఆదాయాన్ని వాయిదాల చెల్లింపులకు వినియోగిస్తున్నారు. 36 శాతం ఈఎంఐలు కూడా ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది గత ఐదేళ్లలో 321 శాతం అభివృద్ధిని సూచిస్తుంది. మొదటి శ్రేణిలో ఉన్న నగరాలలో 84 శాతం ఈఎంఐ మొత్తాలను ఆన్లైన్లో చెల్లిస్తుండగా, రెండో తరగతి పట్టణాల్లో 141శాతం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, మూడో తరగతి పట్టణాల్లో 145 శాతం ఆన్లైన్లో చెల్లింపులు పెరిగాయి. వాయిదాల పద్ధతి మీద రుణం తీసుకునే సగటు కాలం 54 నుంచి 56 మరియు 58 నెలలకు పెరిగింది. వాయిదాలు పద్ధతి చెల్లింపుల్లో మధ్య తరగతి మరియు సంపన్న వర్గాలే ఎక్కువగా ఉంటున్నాయి.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

