ఆ ఒక్క మాటే సినిమా ఇండస్ట్రీలో సంచలనం అయింది. హీరోయిన్ సమంత నిర్మాతగా , ఆమె ప్రియుడుగా ప్రచారంలో ఉన్న రాజ్ నిడుమోరు కో ప్రొడ్యూసర్ గా ఉన్న శుభం సినిమా విజయం గురించి సమంత ఒక ట్వీట్ చేసారు. మా తొలి అడుగుని ప్రేమతో ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ సమంత చెప్పిన మాటల్లో అంతరార్ధం ఒకటేనని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇద్దరూ నిర్మాత, సహనిర్మాతగా చేసిన సినిమాని అడ్డంపెట్టుకుని అసలు విష్యం చెప్పేశారని భావిస్తున్నారు.
సమంత మాటల్లో చాలా తెలివైనది. చెప్పాలనుకున్నది పరోక్షంగా, ఒక్క మాటలో స్ఫష్టంగా అర్ధం అయ్యేట్టు చెప్పగలదు. గతంలో కూడా పలుదఫాలు సమంత, రాజ్ కలిసి విందులకు, వినోదాలకు, ఆలయాలకు తిరిగారు. ఇటీవల తన దోష నివారణకు ఆమె పలు ఆలయాల్లో పూజలు చేయించారు. తిరుపతికి చెందిన రాజ్ నిడుమోరు కూడా భార్యకు విడాకులిచ్చేశారని ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో రాజ్ నిడుమోరు , సమంత త్వరలో పెళ్ళికి సిద్ధమయ్యారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే ఇద్దరూ డేటింగ్ సంబరాల్లో ఉన్నారని చెప్పుకుంటారు..

