బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక తెలిపింది. . మంగళవారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. .ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని నివేదికలో పేర్కొన్నారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉంది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచనలపై మంత్రి అచ్చెన్ననాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన చేసారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశం ఇచ్చారు. .కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని , రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేసారు.

