బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు రోజులుగా సూరీడు మాయమై.వాతవరణం మొత్తం కూల్ కూల్ గా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకమ్ ఉంది. తమిళనాడులోకూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదిక తెలిపింది.

