ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి .మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు గర్వకారణం. ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలు,, ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకునే వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. అయితే ఆ ఎన్నికల తతంగం ప్రహసనమైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే . ఎన్నికలను నిర్వహించే అధికారులు పంచాయితీ ఎన్నికలైనా , పార్లమెంటు ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలే . అత్యంత జాగ్రత్తగా, అవగాహనతో, పరిశీలనతో , చట్టబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయిన గుజరాత్లో పంచాయతీ ఎన్నికల్లో ఓ దారుణం జరిగిపోయింది. గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నిక కావాలంటే కనీస వయోపరిమితి 21 ఏళ్లుఅందాలి. ఇరవై ఒక్క ఏళ్ళు దాటిన ఆ వ్యక్తి పంచాయితీలో సర్పంచ్ గా పోటీ చేసే దానికి అర్హులు. అయితే గుజరాత్ లోని మేషనా జిల్లాలో గిలోసన్ అనే గ్రామంలో 19 ఏళ్ల యువతి సర్పంచిగా ఎన్నికయింది. చిన్న. వయసులోనే సర్పంచి అయిన వారికి సన్మానాలు చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి ఒక కార్యక్రమం చేపట్టారు .
ఇందుకోసం సర్పంచ్ వయసును బేరీజు . వేసే సమయంలో ఈ తప్పు బయటపడింది. 19 ఏళ్లకే సర్పంచ్ గా యువతి నామినేషన్ వేసి గెలిచింది . సర్పంచ్ కనీస వయోపరిమితి 21 ఏళ్ళు ఉండగా ఆ యువతికి 19 ఏళ్ళే ఉన్నప్పుడు అసలు ఎన్నికల అధికారి ఆ యువతి నామినేషన్ ను ఎలా అనుమతించారు అన్నది ఇప్పుడు ప్రశ్న . దీంతో ఈ విషయమై గుజరాత్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇలా ప్రహసనంగా మారి అపహస్యం పాలు కావడం చర్చనీయాంశమైంది.

