హైవేమీద ప్రయాణం ఇక దూరాన్నిబట్టి భారం కాబోతుంది. టోల్ ప్లాజానుంచి టోల్ ప్లాజాకు అనికాకుండా , దూరాన్నిబట్టి ఫీజులు కట్ అయిపోతాయి. మేనెల ఒకటో తేదీనుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటికంటే ప్రయాణం మరింత జేబుకు బరువు కానుంది. మేనెల ఒకటో తేదీనుంచి జిపిఎస్ ఆధారంతో హైవేపై , ప్రయాణించిన దూరానికి డబ్బులు కట్టాల్సిఉంటుంది. ఈ నూతన విధానంలో GNSS ఉన్న వాహనాలకు 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చు..
GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ . GNSS అంటే వాహనం ఎక్కుడుందో, ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కి ఎంతదూరం ప్రయాణించిందో, టైంలో సహా ఖచ్చితంగా శాటిలైట్ ద్వారా లెక్కించగల సాధనం అన్నమాట. 20 కిలోమీటర్లకు మించిన ప్రయాణానికి దూరాన్ని లెక్కించి టోల్ ఫీజ్ వసూలు చేస్తారు. కిలోమీటర్ కి GNSS సిస్టంద్వారా , వాహనం రకం, రోడ్డు క్యాటగిరిని బట్టి టోల్ ఫీజ్ కిలోమీటరుకు ఇంట అని లెక్కిస్తారు. GNSS లేని వాహనాలు ప్రత్యేక GNSS టోల్ లోకి ప్రవేశిస్తే , డబుల్ ఫీజ్ వసూలు చేస్తారు..

