పర్యావరణం ప్రమాదంలో పడింది. వాతావరణం సమతుల్యత కోల్పోయి గతులు తప్పింది . ఋతువులు దారులు మారిపోయాయి. 120 ఏళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇది రాబోయే మహా విలయానికి సూచికగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యుని చుటూ భూపరిభ్రమణంలో , భూమి 23. 5 డిగ్రీల ఏటవాలులో ఉంటుంది. ఈ పరిణామమే ఋతువులకు కొలమానం, కాలమానం. దీనిలో మార్పు ఉండదు. అయితే భూమిపై పరిస్థితులు మారి , వాతావరణ సమతుల్యం దెబ్బతినింది. నాశనం అవుతున్న పర్యావరణం దీనికి ప్రధాన కారణం.
ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఈ విషయంలో శాస్త్రవేత్తలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నప్పటికీ , వేగంగా జరుగుతున్న పారిశ్రామికరణ, వాహనాల కాలుష్యం ,నీటి కాలుష్యం ,గాలి కాలుష్యం ,భూమి కాలుష్యం ఇలా ఇన్ని కారణాలతో భూగోళం వేడెక్కిపోయింది. ధ్రువాల వద్ద మంచు కొండలు కూడా కరిగి మహా ప్రమాదాలకు కారణమవుతున్నాయి . వాతావరణంలో రేడియేషన్ పెరిగి , జబ్బులకు కారణం అవుతొంది. వాతావరణం లో కార్బనీకరణ ఎక్కువ కావడంతో మనుషులు రోగాల బారిన పడుతున్నారు.
ఈ మార్పులవల్ల వర్షం వస్తుందో ఎప్పుడు వస్తుందో , ఎండ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి . వర్షాలు కూడా ఓకే నగరంలో ఒక వీధిలో పడితే , పక్క వీధిలో ఎండ కాసే విచిత్ర పరిణామం. వేసవి కాలంలో వర్షాలు , వర్షాకాలంలో ఎండలు , ఇలా విపరీత ప్రకృతి వైపరీత్యాలకు కారణం వాతావరణంలో మార్పులే . గాలిలో కాలుష్యం శాతం ఎక్కువ కావడం , అడవులు నరికి వేయడం , పారిశ్రమకీకరణ కాలుష్యం గా మారడం, కాలుష్య రహిత విధానాలకు తిలోదకాలు ఇవ్వడం , ఇలా విపరీత ప్రకృతి వాతావరణం మధ్య భూమిపై జీవరాశి కొట్టుమిట్టాడుతోంది.

