ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్షపడ్డ కర్ణాటక మాజీమంత్రి , సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కి , శిక్ష పడ్డ వెంటనే ఎమ్మెల్యే పదవికూడా పోయింది. చట్ట ప్రకారం రెండేళ్లకు మించి శిక్షపడ్డ ప్రజాప్రతినిధులకు అనర్హత వేటు వర్తిస్తుంది. శిక్ష కలం పూర్తైన తరువాత , మరో ఆరేళ్లపాటు ఎన్నికలో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. అంటే గాలి జనార్దన్ రెడ్డి , ఇప్పుడు 13 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.
ఓబుళాపురం మైనింగ్ స్కామ్ పై కేసు పెట్టిన 14 ఏళ్లకు గాలికి శిక్షపడింది. ఈ కేసులో ఆయన ఏ-2 గా ఉన్నారు. ఏ-1 గా ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అప్పటి మైనింగ్ ఎడి, రాజగోపాల్ కి కూడా శిక్ష పడింది. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఈ కేసులోనుంచి ఇదివరకే బయటపడ్డారు..

