పురాణ కాలంలో కొన్ని అద్భుతాలను వినడమే తప్ప చూడలేదు. కానీ నేటి యుగంలో పురుడు పోసుకుంటున్న అద్భుతాలను మన కళ్ళముందు చూడగలుగుతున్నాం , వినగలుగుతున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి ఎంత గణనీయంగా ఉందో ఈ సంఘటన నిరూపిస్తోంది. 30 ఏళ్ల క్రితం శీతలీకరణ విధానంలో భద్రపరిచిన ఓ వీర్యకణం ఇప్పుడు బిడ్డగా మారి గత నెల 26వ తేదీని పండంటి మగబిడ్డగా పురుడు మూసుకుంది. నిజంగా ఇది అద్భుతం. ఒక జీవ కణం నుంచి అతి సుదీర్ఘకాలం పాటు ఎంబ్రియోసిస్ ద్వారా సుదీర్ఘకాలం పాటు శీతలీకరణ చేసి 30 ఏళ్ళ తరువాత దానిని ఉపయోగించడం, దానిలో జీవం ఇంకా ఉండటం, ఆ జీవం మారడం సంచలనమే.
1990 సంవత్సరంలో వీర్యకణాన్ని, అండ కణాన్ని శీతలీకరణ చేసి భద్రపరిచారు. ఆ తర్వాత గత ఏడాది చివరలో బిడ్డలు లేని ఒక జంటకు 30 ఏళ్లు క్రితం శీతలీకరణ చేసిన ఈ అండాన్ని ఐవిఎఫ్ విధానం ద్వారా ఓ మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టారు. కృత్రిమ గర్భధారణ ద్వారా ఈ జీవకణాన్ని ఆ మహిళ గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత వైద్యులు స్వయంగా ఆమె ఆరోగ్యాన్ని, గర్భంలో అండం పెరుగుదలను పరీక్షిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పరిశీలిస్తూ వచ్చారు. దీని ఫలితంగా పండంటి బిడ్డకు ఆ మహిళ గత నెల 26వ తేదీ జన్మనిచ్చింది. వైద్యరంగ చరిత్రలో ఏదో సంచలనం. అద్భుతం.
ఒకవైపు కృత్రిమ గర్భధారణ పేరుతో ఫెర్టిలిటీ సెంటర్లు దారుణమైన మోసాలు చేస్తూ మహిళలను దోచుకుంటూ నైతిక విలువలకు పాతర వేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మరో సంచలనం ఈ ప్రయోగం. 30 ఏళ్ల క్రితం దాచిపెట్టిన జీవకణం ద్వారా ఓ బిడ్డను ప్రసాదించారు. ఇలా రేయింబవళ్లు శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు చేసి విజయాలను సాదిస్తుంటే , కింది స్థాయికి వచ్చేటప్పటికి డబ్బులకు కక్కుర్తిపడి కొందరు వైద్యులు ఆ ప్రయోగ ఫలితాలను బ్రష్టు పట్టిస్తున్నారు. వైద్య రంగాన్ని కళంకితం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లాంటి సంఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నాయో తెలీదు . ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో అనైతిక విలువలకు అనైతిక పద్ధతులకు పాల్పడే వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరించి ,వైద్య రంగం సాధిస్తున్న ప్రగతిని మంచి మార్గంలో అందించే ప్రయత్నం చేయాలన్నదే ప్రజల అభిలాష..

