సబ్బు కొంటే బ్రష్ ఫ్రీ, బకెట్ కొంటే మగ్గు ఫ్రీ.. ఇలాంటి ఉచిత ప్రకటనల విచిత్రంలో చిన్న కిటుకు ఉంది. ఫ్రీగా ఇచ్చే వస్తువు ధరకూడా డబ్బుపెట్టి కొనే వస్తువుల లోనే కలిసిఉంటుంది . అయితే ఇప్పుడు జపాన్ ఒక వినూత్న పధకం ప్రవేశపెట్టింది. జపాన్ ఎయిర్ లైన్స్ విమానంలో దేశానికి వచ్చే విదేశీయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. విదేశీయులు జపాన్ ఎయిర్ లైన్స్ లో వస్తే , వారు జపాన్ లోనే మరికొన్ని పర్యాటక ప్రాంతాలకు దేశంలోని డొమెస్టిక్ విమానాలలో ఉచితంగా పోవచ్చు.
హోక్కైడో, ఒకినోవా , ఒసాకా, కోయట్ఠోలాంటి పర్యాటక కేంద్రాలకు ఉచిత విమాన సౌకర్యాలను కల్పిస్తున్నారు. విదేశీ టూరిస్టులకు అతిధి మర్యాదలు చేయడంలో జపాన్ పెట్టిందిపేరు. ప్రపంచంలో జపాన్ కి ఈ విషయంలో మంచి పేరుంది. సహజంగానే జపాన్ టూరిస్టులకు స్వర్గధామం. ఈ దేశంలో నేరాల బెదడలేదు. టూరిస్టులను ఇబ్బందిపెట్టే అంశం జరగదు. వారిని చాలా మర్యాదగా చూసుకుంటారు.
జపాన్ లో ఎక్కడైనా కుళాయి నీళ్లు తాగొచ్చు. అంత పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విషయంలో టూరిస్టులకు పూర్తి భరోసా ఉంటుంది. అదే మనలాంటి దేశంలో అయితే , సామాన్యులు కూడా బయటకు వస్తే బాటిల్ వాటర్ కొనుగోలు చేసి తాగుతారు. ప్రధానమంత్రి స్థాయినుంచి కింది స్థాయి వరకు పెట్టె సమావేశాల్లో మినరల్ వాటర్ బాటిల్స్ వాడటం మనకు తప్పనిసరిగా మారింది. అదే జపాన్ లో అయితే ఈ సంప్రదాయం ఉండదు.,ఉన్నతస్థాయి అధికార వర్గం మొత్తం కుళాయినీళ్ళే తాగుతారు.

