మనదేశంలో అత్యంత ఖరీదైన పాన్ ” ప్రేమ సుగంధం “, ఒక్క కిళ్లీ లక్ష రూపాయలు. దీన్ని బొంబాయి , మాహిమ్ మైకేల్ చర్చ్ దగ్గర వేస్తారు. అపర కుబేరులు తమ ఇళ్లలో వేడుకలు సమయంలో ఈ కిళ్లీ వేసుకుంటారు. సంపన్నుల పెళ్ళిలో , పెళ్ళికొడుకు, పెళ్లి కూతురుకు శోభనం సమయంలో ఈ కిళ్లీ ఇస్తారు. ఇంతకీ ఇంత ఖరీదైన ఈ కిళ్ళీలో ఏముంటాయో తెలుసా..? స్పానిష్ కుంకుమ పువ్వు, అశ్వగంధ , పలుచటి చిన్న బంగారు రేకులు, ఉంటాయి. ఈ కిళ్లీలో పొగాకుమాత్రం అసలు వాడరు. దాన్ని ప్రత్యేకంగా తయారుచేసిన రెండు ఖరీదైన పెట్టెల్లో పెట్టి ఇస్తారు.

ఈ రెండు పెట్టెలమీద ప్రిన్స్, మరియు ప్రిన్సెస్ అని ఉంటుంది. ప్రిన్స్ పెట్టెలో కిళ్లీ పెళ్లికొడుక్కి, ప్రిన్సెస్ పెట్టెలో కిళ్లీ పెళ్లికూతురుకు ఇవ్వాలి. ఇంతకీ ఈ కిళ్లీ కొట్టు యజమాని పేరు నౌషద్ ఖాన్, అతడి కిళ్లీ షాప్ పేరు పాన్ స్టోరీ . ఎంబీఏ చదివి , వినూత్నంగా ఆలోచించి ఈ ఖరీదైన కిళ్లీ వ్యాపారం ఎంచుకున్నాడు. అతడివద్ద మినిమమ్ 25 వేల రూపాయలు కిళ్లీ వరకే ఉంటుంది. అంతకు తక్కువ ధరలో కిళ్లీ అమ్మడు. కిళ్లీ, ఆకువక్క.. ఇలాంటివి నిజానికి మనదేశంలో పుట్టినవి కావు.

ప్రాచీకాలంలో ఇవి ఇండోనేషియా , ఫిలిప్పైన్ దేశాలలో అలవాట్లు. 7వేలసంవత్సరాలక్రితం ఆ దేశాలలో సమాదుల్లో శవపేటికలలో ఆకువక్క ఆనవాళ్లు కనుగొన్నారు. అయితే ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం భారతీయుల్లోనే కాదు, భారతీయ సంప్రదాయాల్లోనూ , ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ వేళ్ళూనుకుపోయింది. ఆకువక్కనుంచి పుట్టిందే కిళ్లీ . ఇది మొఘల్ రాజులపాలనలో మనదేశంలోనే మొదలైంది..

