నక్కలు తమ మూత్రంతో సంకేతాలు ఇస్తాయి. తామెక్కడ ఉండేది నక్కలు చుట్టుపక్కలరాళ్లపై మూత్రం పోయడం ద్వారా ఇతర నక్కలకు తెలియజేస్తాయి. ఇతర నక్కలు మూత్రం వాసన చూసి అది ఆడనక్క మూత్రమో , మగనక్క మూత్రమో తెలుసుకుంటాయి. ఆడనక్క గర్భంతో ఉంటే ఆ విషయం కూడా నక్కలు మూత్రం వాసన చూసి కనిపెట్టేస్తాయని శాస్త్రవేత్తలు నిర్దారించారు.
నక్కల గ్రహణ , మరియు వాసన శక్తి అంత బలీయమైనది. ఇకపోతే కపట నాటకం, కుటిల బుద్ది , దొంగ వినయం , మోసం ..ఇలాంటివన్నీ నక్కకున్న బుద్ధులే.. వీటిని శాస్త్రీయంగా నిర్దారించకముందే , పూర్వీకులు నక్కల ప్రవర్తన కనిపెట్టి , వక్రబుద్ధి మనుషులను నక్కలతో పోల్చారు.

