అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వెనక కుట్ర దాగి ఉందా? ఈ విషయం ఇప్పుడు భద్రతాధికారులను వేదిస్తున్న ప్రశ్న. విమాన ప్రమాదాలను అధ్యయనం చేసే కమిటీ సభ్యులలో తలెత్తిన ఈ అనుమానానికి బలమైన ఆధారాలు కూడా వారు చూపిస్తున్నారు. విమాన ప్రమాదం జరిగిన నెల రోజుల్లో ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించాల్సిన బాధ్యత విచారణ అధికారులపై ఉంటుంది. ఈ ప్రాథమిక సమాచార నివేదిక ప్రకారం విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేస్తూ ప్రహరీ గోడను దాటకముందే ప్రమాద ఘంటికలు మ్రోగించింది.
ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడను దాటేలోగానే పైలెట్లు వాయిస్ రికార్డర్ లో మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఒక్క సెకండ్ వ్యవధిలో విమానం రెండు ఇంజిన్లు స్విచ్ లు ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్ అయిపోయాయి .దీంతో ఇంజన్లు పనిచేయడం నిలిచిపోయాయి. మొట్టమొదట ఒక స్విచ్ ఆఫ్ కావడంతో అది తెలుసుకునేలోగానే రెండో ఇంజన్స్ ఫ్యూయల్ స్విచ్ కూడా ఆఫ్ అయిపోయింది . అదే సమయంలో ఒక పైలట్ కో పైలెట్ ను నువ్వు ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆపేసావు అని అడగడం, తాను అలా చేయలేదని అతను సమాధానం ఇవ్వడం స్పష్టంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు విద్రోహ చర్య జరిగిందా అన్న అనుమానానికి అవకాశం ఇస్తుంది. విమానం టేక్ అఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ పరిణామం సంభవించడం బలమైన అనుమానాలకు తావిచ్చింది.
విమాన ప్రమాదానికి పక్షి దాడి కారణమే కాదని కమిటీ తెలిసింది. ఎయిర్పోర్ట్ లో విమానం బయలుదేరే ముందు చెకింగ్ షీట్ పై సమగ్రమైన వివరాలను సేకరించింది వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత విమాన ప్రమాదానికి కారణం రెండు ఇంజిన్ లకు సంబంధించిన ఇంధనం స్విచ్ లు ఆగిపోవడమేనని తేల్చింది . ఈ విమాన ప్రమాదంలో 260 మంది చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో 12 మంది విమానం సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడుగా ఒకే ఒక వ్యక్తి తప్పించుకొని బయటపడటం విశేషం.
దేశంలో తీవ్రమైన దుమారాన్ని, సంచలనాన్ని ఈ ప్రమాదం రేపింది. అయితే విమాన ప్రమాదానికి అన్ని కారణాలను కమిటీ విచారించిన తర్వాత ఇంధనం స్విచ్ లు ఒకదానితరువాత ఒకటి ఒక్క సెకండ్ వ్యవధిలో ఆగిపోవడం ఇప్పుడు చర్చనియాంశం అవుతుంది. దీని వెనక విద్రోహ చర్య విషయమై ఇక దర్యాప్తు మొదలు కావాల్సిన అవసరం ఉంది.

