కుక్కతోక వంకర..ఈ సామెత పురాతనకాలంనాటిది.. అయితే కుక్క తోక ఎందుకు ఊపుతుందో , శునక ప్రేమికులకు బాగాతెలుసు.. అదేవిధంగా కుక్క తోక ఊపడంలో దాడికి సిద్ధం అవుతొందన్న సంకేతం కూడా ఉంటుంది. అందువల్ల కుక్క తోక ఊపడంలో ఐదు లక్షణాలు ఉంటాయి. వీటిని సమగ్ర పరిశోధనల తరువాత వెటర్నరీ నిపుణులు నిర్థారించారు. అందువల్ల వీటిని జాగ్రత్తగా గమనించాలి. తోకఊపడంలో దాని మూడ్, బాడీ లాంగ్వేజీ కూడా ప్రధానమైనదే. కుక్క సంతోషంగా ఉన్నప్పుడు , తాన్ భావోద్వేగాన్ని తెలిపేందుకు తోకను నింపాదిగా ఊపుతుంది. అప్పుడు దాని తోక బిగుతుగా లేకుండా లూజ్ గ ఉంటుంది. ఇది కుక్క సంతోషాన్ని తెలియజేస్తుంది.

దాడికి సిద్దమవుతున్నప్పుడు ఆందోళన, అప్రమత్తతతో ఉన్నప్పుడు తోకను వేగంగా ఊపుతుంది. దాడిచేయబోయే ముందు, తోకను పైకెత్తి ఆడిస్తూ, శరీరం మొత్తాన్ని రెడీ అన్న స్థాయిలో బిగుతుగా సాగదీస్తుంది. ఇలాంటి బాడీ లాంగ్వేజిలో కుక్క దాడికి సిద్దమై పోయిందని అర్థంకావాలి. మనిషి ముఖాన్ని చూసి అతడిలో భావాలను ఎలా అంచనా వేస్తారో, కుక్కలోని భావోద్వేగాలకు అది తోక ఆడించే విధానం , దాని బాడీ లాంగ్వేజీ నిదర్శనాలు.. అందువల్ల కోపం, తాపం చూపించేందుకు మనకు కళ్ళు ఉంటే , కుక్కకూ తోక ఉంటుంది. దానితోనే అది దాని భావోద్వేగాలను తెలియజేస్తుంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

